YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతివాసులకు సర్వదర్శనం..

తిరుపతివాసులకు సర్వదర్శనం..

- ఫిబ్రవరి మూడోవారం లేదా మార్చి నుండి  అమలు..

తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని స్థానికులూ సులభంగా పొందే అవకాశం కలగనుంది. టైంస్లాట్‌ సర్వదర్శనం విధానాన్ని తిరుపతిలోనూ ప్రారంభించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి తిరుమల, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదికన టైం స్లాట్‌ సర్వదర్శనం అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో టైం స్లాట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుచానూరులోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి మూడోవారం లేదా మార్చి నుండి పూర్తిస్థాయిలో కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా స్థానిక ఆలయాల సందర్శనకు భక్తులు తమ ఆధార్‌కార్డు చూపించి సులభంగా టికెట్లు పొందవచ్చు. కేటాయించిన సమయాన్నిబట్టి శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇతర స్థానిక ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. 1999లో రూ.50 సుదర్శన టికెట్ల విధానం సందర్భంలో భక్తులు జిల్లాలోని స్థానిక ఆలయాలు సందర్శించేవారు. 

Related Posts