ఢిల్లీ,
1,39,750 కోట్ల పన్నులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ కి 25,066.88 కోట్లు, బిహార్ కు 14056.12 కోట్లు, మధ్య ప్రదేశ్ కు 10,970.44కోట్లు, పశ్చిమ బెంగాల్ కు 10,513.46 కోట్లు విడుదల అయ్యాయి.
ఇక ఏపీకి 5655.72 కోట్లు విడుదలవగా, తెలంగాణకు 2937.58 కోట్లు మంజూరు అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు 2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.