విజయవాడ
మంగళవారం జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబును నేతగా ఎన్నుకున్నారు.అందుకు అయన దన్యవాదాలు తెలిపారు.చంద్రబాబు మాట్లాడుతూ - రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు. - ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాత్యత మనపై ఉంది . రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నికల్లో 93 శాతం గెలవడం దేశ చరిత్రలో అరుదైన అనుభవం. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది . బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొందింది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం పెరిగింది. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేను. నేను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు - బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు. ప్రజలు పవిత్రమైన బాధ్యత మనకు అప్పగించారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నా. - మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కార్యక్రమానికి మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమిష్టిగా పరజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ముందుకెళ్లాం. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని అన్నారు.
పేదల జీవితం మార్చేందుకు అందరూ కష్టపడదాం. రాష్ట్రం పూర్తిగా శిధిలమైంది. ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్షా రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతానని చెప్పా. - నా శపథాన్ని ప్రజలు గౌరవించారు.. గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశాం. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకపోయింది. - కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తాం. వ్యవసాయ రంగం స్థిరత్వానికి కృషి చేస్తాం . రాష్ట్రం సంక్షోభంలో ఉంది.. రైతులు అప్పుల పాలయ్యారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏమిటంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా వెళ్లాలి. ప్రజావేదిక మాదిరిగా కూల్చివేతలు ఉండవు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. - అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం. గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపుల బంద్ జరిగేది. గతంలో సీఎం వస్తే పరదాలు కట్టడం వంటివి జరిగేవి. - నేను మామూలు మనిషిగానే వస్తా.. అందరితో కలిసి ఉంటాననని అన్నారు.
మేమందరం సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. హోదా అనేది సేవ కోసం తప్ప.. పెత్తనం కోసం కాదు. - సీఎం వస్తే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆదేశాలిచ్చా. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు. - ప్రజాహితం కోసం పనిచేస్తాం. ప్రతి నిర్ణయం.. ప్రతి అడుగు ప్రజల కోసమే. స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తామని అన్నారు.
- తప్పులు జరిగితే సలహాలు ఇచ్చే విధానం నెలకొల్పుతాం. - రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా సాగాలి. ప్రపంచ దేశాల్లో భారత్ నంబర్ వన్ గా తయారు కావాలి. 2047 నాటికి భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో భారతీయులు నంబర్ వన్ గా ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండాలని అన్నారు.