YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జనరల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

జనరల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
సిద్దిపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 300 పడకలతో 150 మెడికల్ సీట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి డా,, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ  ప్రారంభోత్సవానికి  మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తదితరులు హజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  జిల్లా, పట్టణ చరిత్రలో ఒక మారుపులేని రోజు.  ఇదంతా సాధ్యం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ అని అన్నారు.  ఈ 5 అంతస్తుల భవనాన్ని పూర్తి చేసుకోవడానికి ఐదున్నర నెలల్లో పూర్తి చేసిన ఘనత సిద్దిపేట జిల్లాకే దక్కింది.  సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ వైద్య కలశాలకు ప్రిన్సిపాల్ గా డా,, తమిళ్ అర్సు ను నియమించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.  300 పథకాలతో 150 మెడికల్ సీట్ల కళాశాల నిర్మించుకోవడానికి వైద్యశాఖ మంత్రి డా,, లక్ష్మారెడ్డి కృషి చాలా ఉంది. సిద్దిపేట జిల్లాలో ఇంత మంచి సేవ అందించుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.  
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు కృషి పట్టుదలతో సిద్దిపేట పట్టణంలో వైద్య కళాశాల సాదించుకున్నారు. ఈ వైద్య కళాశాల వచ్చినందుకు సిద్దిపేట ప్రజలకు శుభాకాంక్షలు. గత 50 సంవత్సరాలలో 5 మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఐదు  సంవత్సరాలు గడవక ముందే సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ సాధించుకున్న ఘనత హరీష్ రావుకు చెందుతుంది.  ఎప్పటికప్పుడు సిద్దిపేట జిల్లా పర్యటిస్తూ అహర్నిశలు పర్యవేక్షిస్తూ పూర్తి చేసుకున్నాడు హరీష్ రావని అభినందించారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక రికార్డు సృష్టించబోతుంది.  కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి నిర్మాణం చేపట్టాలంటే 20 నుంచి 30 ఏళ్ళు పడుతుంది, కానీ అతి తవ్వువ సమయంలో పూర్తి చేసుకోబోతున్నమన్నారు.  నీళ్ల మంత్రిగా తన సాయశక్తులు ప్రయత్నిస్తున్నాడు హరీష్ రావు.  ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు ఇంతకుముందు ఉన్న అపోహ పోయిందని అన్నారు. ప్రభ్యత్వ ఆసుపత్రిలో అధునాతన టెక్నాలజీతో ఇప్పుడు ప్రతి ఒక్క రోగానికి వైద్యం అందుతుందన్నారు.  

Related Posts