YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్టీపీసీ ఫ్లైయాష్ ను దోచుకుంటున్న పొన్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్టీపీసీ ఫ్లైయాష్ ను దోచుకుంటున్న పొన్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్
రామగుండం ఎన్టీపీసీ  లో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఓ లారీ లో 32 టన్నులు ఫ్లై యాష్ తరలించాల్సి ఉంటె 72 టన్నులు తరలిస్తున్నారు. వే బిల్లుల్లోఎన్ని టన్నులు అని పేర్కొనడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కే పి వివేకానంద, డాక్టర్ కే సంజయ్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. .అదనంగా రొజూ తరలిస్తున్న ఫ్లై యాష్ కు 50 లక్షల రూపాయల లు అక్రమంగా సంపాదిస్తున్నారు .ఈ డబ్బులు పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ వసూల్ చేస్తున్నారు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న 13 లారీ లను నేనే స్వయంగా పట్టుకున్నాను. కేవలం రెండు లారీలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారు. ఆధికారులు తమ భాద్యతలు తాము నిర్వర్తించాలి. నేను లారీలు పట్టుకుంటున్నా అని హుస్నాబాద్ మీదుగా తరలిస్తున్నారు. పొన్నం ఎక్కడ్నుంచి తరలించినా బీ ఆర్ ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారు. ఫ్లై యాష్ లారీ లతో రోడ్డు ప్రమాదాలు కూడా జరగుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్ధి అఖిల్ ను ఫ్లై యాష్ లారి బలి తీసుకుంది. అఖిల్ మరణం తోనే నాకు ఫ్లై యాష్ ఓవర్ లోడ్ లారీ ల గురించి తెలిసింది. .అఖిల్ మరణం మంత్రి పొన్నం కు శాపం లా తగలడం ఖాయమని అన్నారు.
ఎన్టీపీసీ  అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు ? .తరలిస్తున్న ఫ్లై యాష్ వివరాలను ఆ సంస్థ  ఎందుకు దాస్తోంది ? ఆ అధికారుల తీరుపై ఢిల్లీలో పిర్యాదు చేస్తాం. ఫ్లై యాష్ ఓవర్ లోడ్ దందా ఆపకపోతే మా పార్టీ ఎమ్మెల్యేల బృందం రామగుండం ఎన్టీపీసీ ని సందర్శిస్తుంది . నేను ఆధారాలతో ఆరోపణలు చేస్తుంటే పొన్నం నా దిష్టి బొమ్మలు దహనం చేపిస్తున్నారు. పేదల శవాలపై పొన్నం పేలాలు ఏరుకుంటున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఓవర్ లోడ్ లారీ ల దందా ఆపకపోతే మా కేడర్ ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతుంది. అధికారులు కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలకు అనుగుణంగా పని చేయాలి. తప్పు చేస్తున్న అధికారుల వివరాలను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నాం ..మేము అధికారం లోకి రాగానే వారిపై చర్యలు తప్పవు. .కరీంనగర్ రేవంత్ పొన్నం టాక్స్ అమలవుతున్నట్లు మాకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్  మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు వితండ వాదం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆగస్టు 15 లోగా గ్యారంటీలు అమలు చేసి రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావే కాదు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేస్తాం. పెద్దోళ్ళను తిడితే పెద్దోడిని అవుతా అని ఆది శ్రీనివాస్ అనుకుంటున్నారు. ఆది శ్రీనివాస్ కు వేముల వాడ లో వచ్చిన ఓట్లు 71 వేల ఓట్లు ..హరీష్ రావు కు వచ్చిన మెజారిటీ 80 వేలకు పైనే . హరీష్ రావు ను చూసి అందరూ నేర్చు  కోవాలి. .హరీష్ రావు పద్దెనిమిది గంటలు కష్టపడతారు . పని పాట లేనిది ఆది శ్రీనివాస్ కే నని అన్నారు.

Related Posts