న్యూఢిల్లీ
ఏఐసీసీ కార్యాలయం కి వెళ్లిన జగ్గారెడ్డి కి ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు..చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేని.. మహారాష్ట్ర లోని షిరిడి ప్రాంతానికి చెందిన సదాశివాలేఖర్ కనిపించారు. అతని నుండి వివరాలు సేకరించారు. సదశివాలేఖర్..నాలుగున్నర ఎకరాల సాదాసీదా రైతు... కాంగ్రెస్ కి వీరాభిమాని. రాహుల్ గాంధీ కోసం మణిపూర్ నుండి బాంబే వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర లో చెప్పులు లేకుండా పాల్గొన్నారు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.... రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని... రైతులకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్ నని... రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్నీ వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డి కి వివరించారు సగటు మహారాష్ట్ర కి చెందిన రైతు.