న్యూఢిల్లీ, జూన్ 12,
సినిమాలు, రాజకీయాలు ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం,, పొలిటీషియన్స్ సినిమాలు చేయడం ఇప్పుడు సర్వ సాధారణం. ఇప్పుడు చెప్పబోయే అలాంటి ఓ అసక్తికరమైన విషయం తాజా లోక్‌సభ ఎన్నికల్లో జరిగింది. బాలీవుడ్‌లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంట్ సభ్యులు అవడమే కాక, అందులో ఒకరు మంత్రి కావడం గమనార్హం. ఈ జంటే చిరాగ్ పాశ్వాన్ (, కంగనా రనౌత్ ఇందులో కంగనా రనౌత్ మొదటి సారి ఎంపీగా ఎన్నికవ్వగా పాశ్వాన్ మూడోసారి లోక్‌సభకు ఎన్నికవడమే కాకుండా మినిష్టర్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం.2011లో వచ్చిన మిలే నా మిలే హమ్ అనే చిత్రంతో అప్పటికే దేశ రాజకీయాల్లో మంచి పేరున్న ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతని సరసన అప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ కథానాయికగా నటించింది.ఈ జంటపై రెండు మూడు పాటలు కూడా ఉండగా ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోయింది. ఈ చిత్రం తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రికి మద్దతుగా రాజకీయాల్లోకి వెళ్లి 2014లో ఎంపీ అయి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు.తండ్రి మరణానంతరం తమ ఎల్జేపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుండి నడుపుతున్నారు. తాజాగా జరిగిన ఎలక్షన్‌లో మరోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇక కంగనాఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన తను వెడ్స్ మను సినిమాతో స్టార్‌గా ఎదిగి జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీయెస్ట్ తారగా మారి వరుస సినిమాలతో దూసుకుపోయింది.అంతేకాక బాలీవుడ్‌పై, అడపాదడపా శివసేన వంటి పార్టీలపై తన కామెంట్స్‌తో వార్తల్లో నిలిస్తూ వచ్చిన బీజేపీలో చేరిన కంగనా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాశ్వాన్, కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరికొకరు అప్యాయంగా పలకరించకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీబడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి. ఈజంట కలిసి నటించిన మిలే నా మిలే హమ్ అనే చిత్రం ప్రస్తుతం యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్నది. ఆసక్తి ఉన్నవారు చూడొచ్చు.