YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసిన ఆర్టిఏ అధికారులు

విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసిన ఆర్టిఏ అధికారులు

పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్ ల ఫిట్ నెస్ లను ఆర్టిఏ అధికారులు ఈరోజు తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈరోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, బస్సుల ఫిట్ నెస్, డ్రైవర్ ఫిట్ నెస్, సర్టిఫికెట్లను అదేవిధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Related Posts