అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు.
మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజా గా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు.
2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచ లన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రి గా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.