YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హాజరైన ఎన్డీయే నేతలు

హాజరైన ఎన్డీయే నేతలు

విజయవాడ, జూన్ 12 ,
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. అమరావతిలోని కేసరవల్లి సభ మూడు పార్టీల జెండాలతో కళకళలాడింది. ఈ వేడుకకు ప్రధాని మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, గడ్కరీ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రులు చిరాక్ పాశ్వాన్, అనుప్రియ పటేల్, అథవాలేతో పాటు ఎన్డీఏ పక్ష నేత ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. బీజేపీకి చెందిన అగ్రనేతలంతా కేసరపల్లిలో ల్యాండ్ అయ్యారు. వీరితో పాటు మాజీ సుప్రీంకోర్టు సీజేఐ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్ సహా ప్రముఖులంతా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. వీరితో పాటూ సినీ ప్రముఖులు చిరంజీవి, రజినీ కాంత్ కూడా హాజరయ్యారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11.36 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Related Posts