YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫ్యామిలీలను పక్కన పెట్టేశారు...

ఫ్యామిలీలను పక్కన పెట్టేశారు...

నెల్లూరు, జూన్ 13,
చంద్రబాబు నాయుడు ఈసారి మంత్రి వర్గ కూర్పులో విన్నూత్న తరహాను అవలంబించారు. సీనియారిటీ అన్నది కూడా పెద్దగా చూడలేదు. అలాగే రాజకీయాల్లో ప్రతిష్ట కలిగిన కుటుంబాలను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా చంద్రబాబు మారిపోయారన్న దానికి ఈ మంత్రి వర్గ కూర్పు ఉదాహరణ అని అందరూ భావించేలా కేబినెట్ ఉందన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ అంటే ఖచ్చితంగా ఉంటామని భావించిన వాళ్లకు ఈసారి మాత్రం నిరాశ ఎదురయింది. అంతేకాదు.. తాను ఇంతేనని చంద్రబాబు కొందరు నేతలకు చెప్పినట్లయింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని కుటుంబాలతో వేరు చేసి చూడలేం. ఎందుకంటే దశాబ్దకాలం నుంచి ఆ కుటుంబాలు టీడీపీతో నడుస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురయినా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తాము మాత్రం జెండాను వదలలేదు. ఓడిపోయిన సమయంలోనూ నిరాశ చెందకుండా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచాయి. దశాబ్దాల కాలం పాటు ఆ కుటుంబాలు అలాగే కొనసాగుతున్నాయి. పూసపాటి, యనమల, సోమిరెడ్డి, బొజ్జల, కేఈ, ధూళిపాళ్ల ఇలా అనేక కుటుంబాలు చంద్రబాబుతో పాటు నడిచాయి. వ్యక్తిగతంగా తాము నష్టపోయినా అదరకబెదరక టీడీపీ వైపు మాాత్రమే ఉన్నాయి. అందుకే వారిలేని చంద్రబాబు కేబినెట్ ను ఊహించుకోలేరు ఎవరూ.కానీ ఈసారి ఈ కుటుంబాల్లో ఎవరికీ కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గత ప్రభుత్వ హయాంలో సంగం డెయిరీ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్థికంగా నష్టపోయారు. జైలు పాలయ్యారు. ఇక పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబం అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంది. ఈసారి అశోక్ గజపతి రాజు పోటీ చేయకపోయినా ఆమె కుమార్తె ఆదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఈసారి ఆమెకు క్షత్రియ కోటాలో దక్కుతుందని భావిస్తే అది సాధ్యపడలేదు. ఇక నెల్లూరు జిల్లా టీడీపీ అంటే గుర్తుకొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయనను కూడా ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. 2014లో సోమిరెడ్డి గెలవకపోయినా ఎమ్మెల్సీని చేసి మరీ చంద్రబాబు కేబినెట్ లో తీసుకున్న విషయాన్ని మర్చిపోలేం. అలాంటి సోమిరెడ్డి ఈసారి తనకు పదవి గ్యారంటీ అనుకుంటే.. ఆయనకు దక్కలేదు.ఇక చంద్రబాబు ప్రతి మంత్రివర్గంలో బొజ్జల కుటుంబం ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపొందారు. యువనేతల కోటాలోనూ, పార్టీకి నమ్మకంగా ఉన్న కుటుంబం కోటాలో ఆయనకు పదవి గ్యారంటీ అని భావించినా అది కూడా సాధ్యపడలేుద. దీంతో పాటు యనమలకు నిరాశ ఎదురయింది. వీరితోపాటు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కేబినెట్ లో చోటు గ్యారంటీ అనుకున్నా కుదరలేదు. ఇక అనంతపురం జిల్లాలో పట్టున్న కుటుంబం పరిటాలను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక బీసీ అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కేఈ కుటుంబానికి కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు. ఇక జేసీ, నల్లారి, భూమా కుటుంబాలు కూడా పదవులను ఆశించి భంగపడిన వారిలో ఉన్నారు. ఇలా కొన్ని కుటుంబాలను పక్కన పెట్టి చంద్రబాబు ఈసారి అందరినీ ఆశ్చర్యపర్చారనే చెప్పాలి.

Related Posts