YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డి పై టిడిపి బుద్దా వెంకన్న ఫైర్

విజయసాయిరెడ్డి పై టిడిపి బుద్దా వెంకన్న ఫైర్

విజయవాడ
వైకాపా నేత విజయ సాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మడిపడ్డారు.
వైసిపిలో మంత్రులు, ఎమ్మెల్యే లు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే వాళ్లకి తప్పు అని చెప్పలేదే దాడులు చేయవద్దని మా నాయకులు ముందే చెప్పారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారు. ఈ ఐదేళ్లల్లో నువ్వు, మీ జగన్ మీ వాళ్ల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదు. ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారు. విజయసాయి రెడ్డి ఒక లుచ్చా.. ఉత్తరాంధ్ర దోచేశాడు. వీటి పై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే... ఇలా ఉంటుందా పరిస్థితి. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారు. జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశాడా. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగింది. దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. సింహాలు, పులులు అన్న వాళ్లు... అధికారం పోగానే పిల్లులు అయిపోయారా. టిడిపి కార్యాలయం పై దాడి చేసిన దేవినేని అవినాష్ కి గన్ మెన్లు ఇచ్చారు. బూతులు తిట్టే నానిలకయ, వంశీకి భద్రత పెంచింది మీరు. వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు.. శిక్ష పడాల్సిందేనని అన్నారు.
మీ వంశీ తో నాకు ఫోన్ చేయించండి ... నేను వాడితో మాట్లాడతా. అధికార మదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లోవాళ్లను తిట్టించారు. అప్పుడు మీకు వాళ్ల బాధ తెలియలేదా... చట్టాలు గుర్తు రాలేదా. ముసలి నక్కా... నువ్వు ఇంకా నక్క వేషాలు మాను. ఈ ఐదేళ్లల్లో మేము ధైర్యం గా పోరాడి  నిలబడ్డాం. మా చంద్రబాబు సవాల్ చేసి, సిఎం అయ్యాక అసెంబ్లీ లో అడుగు పెడుతున్నారు. మీ అవినీతి, అక్రమాల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు కు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది... జగన్ కు అదీలేదు. మీకు సిగ్గు, శరం ఉంటే... వైసిపి ని పూర్తిగా రద్దు చేయండి. విజయసాయి రెడ్డి నీ మాయ మాటలు ఎవ్వరూ నమ్మరు. నువ్వు ముసలి నక్కవి, శకునివి... వదిలేది లేదు. వంశీని పిలిపించి పక్కన కూర్చో పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టు. మీ ఆగడాలను ఐదేళ్లు భరించాం... కేసులకు భయపడకుండా పోరాటాలు చేశాం. ఐదు రోజుల్లోనే ఫిర్యాదు లు అంటూ హడావుడి చేస్తున్నారు. అధికార మదంతో అడ్డగోలుగా వాగిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాలని అన్నారు.

Related Posts