YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

న్యూ ఢిల్లీ జూన్ 13
ఢిల్లీ శాస్త్రి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పిత్తి జరుగుతోందని, విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు.
మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుదామని, ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు.తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లికూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‎తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related Posts