YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంటర్నేషనల్ సైన్స్ & మ్యాథ్స్, ఒలింపియాడ్స్ లో విజయదుందుభి మోగించిన నారాయణ విద్యార్థులు....

ఇంటర్నేషనల్ సైన్స్ & మ్యాథ్స్, ఒలింపియాడ్స్ లో విజయదుందుభి మోగించిన నారాయణ విద్యార్థులు....

హైదరాబాద్
హెచ్.బి.సి.ఎస్.ఈ (HBCSE), భారతప్రభుత్వం వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్(OCSC) మరియు ఇంటర్నేషనల్ మ్యాథమేటికల్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్(IMOTC) కి నారాయణ నుండి అత్యధికంగా 45 మంది విద్యార్థులు సెలక్షన్స్ సాధించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో మ్యాథ్స్ ఒలింపియాడ్ కు 12 మంది, కెమిస్ట్రీ ఒలింపియాడ్ కు ఇద్దరు,ఫిజిక్స్ ఒలింపియాడ్ కు 6 గురు,జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ కు 5 గురు,జూనియర్ ఆస్ట్రానమీ 9 మంది,బయోలజీ ఒలింపియాడ్ కు ఒకరు,ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ కు 8 మంది,ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ కి ఇద్దరు నారాయణ విద్యార్థులు అత్యంత కీలకమైన దశ అయిన ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ క్యాంప్ కు అర్హత సాధించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా॥ పి.సింధూర నారాయణ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 45 మంది విద్యార్థులలో,10 మంది విద్యార్థులు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్,ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్,ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ మరియు జూనియర్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారాన్నారు.ఇండియాలోనే నారాయణ తప్ప మరే ఇతర సంస్థ ఇంతటి అత్యద్భుత విజయం సాధించలేదన్నారు.రాష్ట్రస్థాయిలో అయినా,జాతీయస్థాయిలో అయినా పోటీపరీక్ష ఏదైనా నెం.1 స్థానాన్ని నారాయణ విద్యార్థులే కైవసం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు.నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా నారాయణ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.సబ్జెక్టు బెడిక్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్ తో పాటు ఫండమెంటల్స్ లో కూడా సమగ్ర అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.స్కూల్ విద్యకు ఆధునిక విద్యావిధానాలు జోడించి విద్యనందిస్తున్నామన్నారు.నేటి పోటీ ప్రపంచం విసిరే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటూ,నిరంతరం విజేతగా నిలిచేలా ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థుల్లో నింపుతున్నామన్నారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా CBSE తో కూడిన ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్ ను ప్రవేశపెట్టి,విద్యనందించటం వలనే ఇలాంటి ఎన్నో అద్భుత ఫలితాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు.సైంటిఫిక్ గా రూపొందించిన నారాయణ సిఓ-స్పార్క్,ఒలింపియాడ్,ఈ-టెక్నో,మెడిస్పార్క్ ప్రోగ్రామ్స్ సంచలన విజయాలు ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రతి తరగతిలోని ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహించటమే కాకుండా మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ,బయాలజీ,ఆస్ట్రానమీలతో పాటు కంప్యూటర్స్ మరియు ఆప్టిట్యూడ్ సబ్జెక్టులలో బేసిక్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పూర్తిస్థాయి నాలెడ్జ్ ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కు ప్రాధాన్యత ఉండేలా ల్యాబ్స్ ను అందుబాటులో ఉంచామని మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ సందర్భంగా ఘనవిజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.పునిత్ ప్రత్యేకంగా అభినందించారు....

Related Posts