YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ స్పీకర్ కోసం... సీనియర్లు

అసెంబ్లీ స్పీకర్ కోసం... సీనియర్లు

విశాఖపట్టణం, జూన్ 14,
కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరు? మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ పదవిపైనే పడింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి నూతన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోవాలి. సభలో సీనియర్ నేతలను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సభలో సీఎం చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు నేతలు మాత్రమే ఏడు సార్లు గెలిచారు. చంద్రబాబు సీఎంగా ఉన్నందున ఆయనతో పాటు ఏడుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాల అయ్యన్నపాత్రుడులో ఎవరో ఒకరు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ పదవిపై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు అంగీకరిస్తారా? అన్నదే ప్రశ్న.చంద్రబాబు 4.O ప్రభుత్వంలో అనేకమంది కొత్త వారికే చోటు ఇచ్చారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని యువరత్నాలను ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో జనసేన కాకుండా టీడీపీకి చెందిన 14మంది కొత్త తరానికి అవకాశం ఇచ్చారు. ఇక మంత్రి పదవి ఆశించి అవకాశం కోల్పోయిన సీనియర్లు ఇప్పుడు స్పీకర్ పదవిపై కన్నేశారు. ఉత్తరాంధ్రకు చెందిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకట్రావ్, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గోదావరి జిల్లాలకు చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు, గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఓడించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో విప్ గా పని చేసిన కూన రవికుమార్ ఆ జిల్లాలోని కీలకమైన కళింగ సామాజికవర్గ నేత. మంత్రివర్గంలో ఆ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో స్పీకర్ పదవి రవికుమార్ కు ఇస్తారా? లేక మళ్లీ విప్ గానే నియమిస్తారా? అనే చర్చ జరుగుతోంది.చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై సంచలన విజయం సాధించిన కళా వెంకట్రావ్ కూడా మంత్రి పదవిని ఆశించారు. టీడీపీలో తొలి నుంచి ఉన్న అగ్రనేతల్లో కళా ఒకరు. ఉత్తరాంధ్రలోని కీలకమైన తూర్పు కాపు సామాజివర్గానికి చెందిన నేత కళా. మంత్రివర్గంలో కళాకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని అంతా ఊహించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తూర్పు కాపు సామాజికవర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ రావును మంత్రిని చేశారు చంద్రబాబు. దీంతో కళా వెంకట్రావ్ ని స్పీకర్ ని చేస్తారనే ప్రచారం జరుగుతోంది.గతంలో హోంమంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా, టీటీపీ ఛైర్మన్ గా సేవలందించారు కళా. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి వస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఎలా న్యాయం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. గత ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేసి 70ఏళ్ల వయసులో అత్యాచార కేసు ఎదుర్కొన్న అయ్యన్నపై కేడర్ లో ఎంతో సానుభూమి ఉంది. ఐదేళ్ల కుమారుడు విజయ్ కూడా ఐ-టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నో కేసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అయ్యన్నకు ఎప్పుడూ గ్యారంటీగా ఉండేది. కానీ ఈ దఫా అయ్యన్నకు అవకాశం ఇవ్వలేవు చంద్రబాబు. పార్టీకి వీరవిధేయుడు అయిన అచ్చెన్న నాయుడిని స్పీకర్ చేసి నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయాలని చెతున్నారు.ఇక గోదావరి జిల్లాలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో మొండి చేయి ఎదురైంది. ఈ జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చోటు ఇవ్వడంతో పాటు టీడీపీ తరుపున యువనేత సుభాష్ అవకాశం ఇచ్చారు. దీంతో బుచ్చయ్య చౌదరికి అవకాశాలు ముగిసిపోయాయి.

Related Posts