YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాట్ నెక్స్ట్... చంద్రబాబు...

వాట్ నెక్స్ట్... చంద్రబాబు...

గుంటూరు, జూన్ 14,
నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేశారు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా తన మంత్రివర్గ కూర్పును కూడా కంప్లీట్ చేసేశారు. ఎలాంటి పంచాయితీలు లేకుండా ఈ విషయాన్ని తెగ్గొట్టేశారు చంద్రబాబు. బంపర్ విక్టరీని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయిపోయింది.. సంబరాల సమయం ముగిసింది. మరి వాట్ నెక్ట్స్‌? చంద్రబాబు ఎలాంటి రాష్ట్రాన్ని లీడ్ చేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్లేంటి? ఇచ్చిన హామీల అమలు సంగతేంటి? మధ్యలో పదేళ్ల తేడా ఉంది. కానీ రాష్ట్రం మాత్రం అప్పుడెలా ఉందో.. ఇప్పుడలానే ఉందన్న ప్రచారం ఉంది. రాజధాని లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు. ఇందులో మొదటి టర్మ్‌లో చంద్రబాబు కనుసన్నల్లోనే పాలన జరిగింది. నెక్ట్స్‌ టర్మ్‌లో జగన్‌ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేశారు తప్ప.. అభివృద్ధి చేసింది ఏం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే పాయింట్‌ను ఎన్నికల ప్రచారంలో గట్టిగా వాడుకున్నారు చంద్రబాబు. దీనిని ప్రజలు నమ్మారు.. బంపర్ మెజార్టీతో గెలిపించారు. అంతా బాగానే ఉంది. మరి చంద్రబాబు చేతికి రాష్ట్రం ఎలా వచ్చింది? అనేది ఇప్పుడు మెయిన్‌ క్వశ్చన్.. ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ తెలుసుకుంటేనే చంద్రబాబు అడుగులు ముందుకు వేయగలరు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ప్రజలకు డబ్బులు పంచడానికి కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారు. ఇవీ టీడీపీ నేతలు చేసిన విమర్శలు. అయితే వైసీపీని మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. సో ఇప్పుడీ పథకాలను అమలు చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై అప్పుల భారం తీవ్రంగా ఉంది. మరి చంద్రబాలు హామీలు చేయడానికి మరింత అప్పులు చేస్తారా ? లేక తన చాతుర్యంతో సంపదను సృష్టించి వాటిని జనాలకు అందచేస్తారా? అనేది చూడాలి. నెక్ట్స్ రాజధాని.. తాను మూడు ముక్కలాట ఆడి జనాలను మోసం చేయనని.. ఏపీకి సింగిల్‌ రాజధాని అమరావతి మాత్రమే తేల్చి చెప్పారు చంద్రబాబు. అయితే అమరావతి అభివృద్ధి చంద్రబాబు ఎక్కడైతే వదిలేసి వెళ్లారో అక్కడే ఉంది. సో.. దానిని తిరిగి పట్టాలెక్కించి.. పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. ఇది నిజానికి అనుకున్నంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు.. ఇప్పుడు కూటమి అమలు చేయాల్సిన హామీలు.. ఇవన్నింటిని బ్యాలెన్స్‌ చేస్తూనే.. ఆయన రాజధానిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం.. టీడీపీతో పాటు.. జనసేన, బీజేపీ కూడా అందులో ఉన్నాయి. సో ఏకపక్షంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ నిర్ణయమైనా మిత్రపక్షాలతో చర్చించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే టీడీపీ సింగిల్‌గానే మెజార్టీ మార్క్‌ దాటి సీట్లు దక్కించుకోవడం ఆయనకు ప్లస్ అయ్యే అంశం. మామూలుగానే చంద్రబాబును నిర్ణయానికి ఎదురుండే చాన్స్ ఉండదు. కానీ పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళితే.. అధికారంతో పాటు ఎలాంటి అపఖ్యాతి కూడా చంద్రబాబు దరి చేరదు. చంద్రబాబుకు ఇక్కడ అంది వచ్చిన మరో అవకాశం ఏదైనా ఉందంటే.. కేంద్రంలో ఆయన కింగ్‌మేకర్‌గా ఉండటం.. చంద్రబాబు అవసరం ఎన్డీఏ కూటమికి అత్యవసరం కావడం. దీనిని తనకు అనుకూలంగా మలుచుకొని రాష్ట్రానికి నిధులు సాధించుకుంటే మాత్రం.. ఆయన పాలన నల్లేరుపై నడకలాగానే సాగే అవకాశం ఉంది. అంతేకాదు కాస్త కష్టపడి ప్రత్యేక హోదా సాధిస్తే మాత్రం ఆయన ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. నిజానికి చంద్రబాబు అంటే సంక్షోభం నుంచి సక్సెస్ వెతుక్కుంటారు. సో.. ఆయనకు ముందు ముందు ఎదురయ్యే ఏ సమస్యనైనా సవాల్‌గా తీసుకొని సాల్వ్‌ చేస్తారనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. సో ఆల్‌ ది బెస్ట్ చంద్రబాబు నాయుడు గారు.

Related Posts