YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిద్రలో విద్యశాఖ అధికారులు

నిద్రలో విద్యశాఖ అధికారులు

వరంగల్, జూన్ 14,
విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది?తెలంగాణలో  ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబిత ఇంద్రారెడ్డి పేర్లు యధాతధంగా ఉంచేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనికి బాధ్యులు ఎవరన్నదానిపై విచారణ మొదలైంది.పాఠ్య పుస్తకాలను కనీసం చూడకుండా పంపిణీ చేయడంపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది. అయినా అధికారులు ముందుమాట మార్చకపోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. పుస్తకాలు చూసుకుని విద్యార్థులు సంతోషంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం షాకింగ్‌ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలన్నీ వాపస్‌ తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు పంపిణీ చేసి పుస్తకాలన్నీ తిరిగి తీసుకునే పనిలో ఉన్నారు.విద్యాశాఖ పుస్తకాలు వాసస్‌ తీసుకోవడానికి ప్రధాన కారణం.. పుస్తకాల్లో ముందు మాట మార్చకపోవడమే అని తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో ముద్రించి పంపిణీ చేసింది. ఈసారి పుస్తకాలు ముద్రించిన తెలుగు అకాడమీ.. ముందు మాట మార్చలేదు. దీంతో అన్ని పుస్తకాల్లో పాత ముందుమాటనే ముద్రించింది. ఇందులో పొరపాట్లు ఉన్నాయి. పొరపాటును గుర్తించిన ఉపాధ్యాయులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.మరోవైపు పుస్తకాలపై మాజీ సీఎం కేసీఆర్‌ ఫొటోతోపాటు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంజాలకులు జగదీశ్వర్‌ పేర్లు కూడా ఉన్నాయి. దీంతో అలర్ట్‌ అయిన విద్యాశాఖ అన్ని పాఠ్య పుస్తకాలను వాపస్‌ తీసుకోవాలని ఆదేశించింది.పాఠ్య పుస్తకాలు వాపస్‌ తీసుకున్న విద్యా శాఖ, కొత్తవి ఎప్పుడు పంపిణీ చేస్తారు.. పుస్తకాల్లో ముందు మాట మార్చడానికి ఎంత సమయం పడుతుంది.. అప్పటి వరకు పాఠాలు ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనే విషయంలో ప్రభుత్వం నుంచిగానీ, విద్యా శాఖ నుంచిగానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను ఉపాధ్యాయులు వెనక్కి తీసుకున్నారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts