YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాఠ్యపుస్తకాలు ఎంఈవో కార్యాలయానకి వాపస్

పాఠ్యపుస్తకాలు ఎంఈవో కార్యాలయానకి వాపస్

నల్గోండ
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యపుస్తకాలను తిరిగి ఎంఈఓ కార్యాలయాలకు తరలించారు. ఆయా పాఠ్యపుస్తకాలలో ముందుమాట గత ప్రభుత్వంలో అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మీద ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయా పాఠ్యపుస్తకాల్లో ముందుమాట పేజీ మీద ప్రస్తుత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి పేరు మీద ముందుమాట స్టిక్కర్ అతికించి తిరిగి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
నల్లగొండ జిల్లాలో మొత్తం 1,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,126 ప్రాథమిక, 128 ప్రాథమికోన్నత, 229 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1,54,301మంది  విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 715 ప్రాథమిక పాఠశాలలు, 181 ఉన్నత పాఠశాలలు, 349 ఉన్నత పాఠశాలలు.. 33 ఉన్నత పాఠశాలలు పనిచేస్తున్నాయి. 1,36,855 మంది విద్యార్థులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,27,633మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. జిల్లాలో మొత్తం 3,465 మంది ఉపాధ్యాయులు 2,800 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

Related Posts