YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ రియల్ పై ప్రభావం...

హైదరాబాద్ రియల్ పై ప్రభావం...

హైదరాబాద్, జూన్ 15,
 సౌత్ లో గుర్తింపు ఉన్న నగరం హైదరాబాద్. అన్ని వనరులు ఉన్న భాగ్యనగరం అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భాగ్యనగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, తదితర జిల్లాలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఇక్కడి స్థలాలకు కోట్లాది రూపాయల డిమాండ్లు వచ్చాయి. అయితే, ఇటీవల రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అమరావతిపై ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డైనమిక్స్ ను మార్చవచ్చు అని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన మెజారిటీ వచ్చింది. పైగా కేంద్రంలో ప్రధాన మిత్రపక్షంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున అమరావతికి పెట్టుబడులు రానున్నాయి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడి రియల్ సంస్థలు అమరావతికి షిఫ్ట్ కావచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. అనేక మంది పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ కు వలస వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది హైదరాబాద్ నుంచి కొంత పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీని వల్ల తెలంగాణ రాజధాని రియల్ ఎస్టేట్ ధరలు 10-15 శాతం మేర తగ్గే ఛాన్స్ ఉందని వాణిజ్య స్థిరాస్తి మార్కెట్ క్షీణించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కారణం కాగలదని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరం రియల్ పెట్టుబడి దారులను ఏపీ ఆకర్షించే అవకాశం ఉన్నందున హైదరాబాద్ పై సానుకూల ప్రభావం పడుతుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని జూన్ 11న చంద్రబాబు నాయుడు ప్రకటించారు.2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చంద్రబాబు అమరావతి కోసం భారీ ప్రణాళికలు రూపొందించాడు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా చేయాలనే ఆలోచనను తెరపైకి తెచ్చారు. అయితే, 2019లో టీడీపీ అధికారం కోల్పోయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ విజయం సాధించడంతో ఆ ఆలోచన విరమించుకుంది.

Related Posts