YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్రమ కట్టడాల కూల్చివేతపై బీజేపీ హర్షం

అక్రమ కట్టడాల కూల్చివేతపై బీజేపీ హర్షం

హైదరాబాద్
జీహెచ్ఎంసీ అధికారులు  స్పందించి మాతాజీ నగర్ ఎఫ్ టీ ఎల్ స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలు కూల్చి వేయడం పట్ల బీజేపీ సీనియర్ నాయకుడు నందు హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ స్థలం కాపాడడం కోసం చేస్తున్న తమ పోరాటం ఎట్టకేలకు ఫలించిందని అన్నారు. జీహెచ్ఎంసి అధికారులు బేగంపేట్ ఎఫ్టీఎల్ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సందర్బంగా బీజేపీ నాయకుడు నందు మాట్లాడుతూ భూ బకాసూరులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి అమాయకులకు అమ్ముకుంటూ వాటికి ఇంటి నెంబర్లు, కరెంట్ మీటర్లు సైతం కల్పిస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే విషయంపై రెండు సార్లు ఆర్ టీ ఐ వేసిన ప్రభుత్వం నుండి సమాధానం రాలేదని చెప్పారు. సర్వే నెంబర్. 194/8/1 దాదాపు ఆరు వందల కోట్ల విలువ చేసే 10ఎకరాల 20గుంటల స్థలాన్ని స్వాహా చేయడంలో అధికారులు, గత పరభుత్వ అధినేతల హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఆ స్థలాలను కొన్న వారు తాము చెల్లించిన డబ్బులు నష్టపోయి ఇప్పుడు బాధితులుగా మారారని వెల్లడించారు. వారు తమ మొరను ప్రజాభవన్ ఆవరణలోనే వెళ్ళబోసుకున్నారని, అంతే కాకుండా ప్రజాప్రతినిధులకు వారిచ్చిన డబ్బుల గురించి కూడా చెబుతుండడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని కాపాడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పార్కును, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఇంటి నెంబర్లను, కరెంట్ మీటర్లను కేటాయింపులపై విచారణ జరిపి సంబంధిత అవినీతి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts