YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కువైట్ అగ్ని ప్రమాదం స్పందించిన ప్రధానమంత్రి మోదీ..!

కువైట్ అగ్ని ప్రమాదం స్పందించిన ప్రధానమంత్రి మోదీ..!

ఢిల్లీ,
కువైట్ అగ్ని ప్రమాదం స్పందించిన పీఎం మోదీ
కువైట్ అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను వెంటనే కువైట్ వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈనెల 13న కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో అధికారులు కేరళకు తీసుకొచ్చారు. ఈ నెల 12న కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఇప్పటికే నివాళులర్పించారు.

Related Posts