YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”

మంగళగిరి
గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్... ఇటీవల ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్... నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు “ప్రజాదర్బార్” ను నిర్వహించారు. శనివారం ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండరని వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా, యువనేత లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచారు.  సొంతనిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారు.  నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయదుందుభి మోగించిన లోకేష్... ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు ప్రతిరోజూ ఉదయం లోకేష్ స్థానిక ప్రజలను అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రజానేతగా లోకేష్ వేసిన ఈ తొలిఅడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులకు జారీ చేసారు.

Related Posts