కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పను జూన్ 17 వరకు అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కోర్టు పేర్కొంది. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో యడ్యూరప్ప హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.