YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భాగ్య నగరంపై అమరావతి ఎఫెక్ట్....

భాగ్య నగరంపై అమరావతి ఎఫెక్ట్....

విజయవాడ, జూన్ 17,
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వస్తూ వస్తూ అమరావతికి ఊపిరిలు ఊదింది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. గత ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. మొత్తం విద్యుత్ కాంతులతో అమరావతిని మెరిపించారు.అమరావతి ఊపిరి పీల్చుకో మీ బాబు వచ్చాడు అంటూ సంకేతాలు పంపించారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులతో పాటు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారిలో కొత్త ఆశలు ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఆశలు వదులుకొని.. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారంతా ఇప్పుడు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు.2014లో రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అమరావతి రాజధాని ప్రకటన జరిగింది. రైతుల స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూములను ఇచ్చారు. అదే సమయంలో హైదరాబాదులో స్థిరపడిన ఏపీ వ్యాపారులు అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. అయితే నిధుల లేమి, అనుమతుల ప్రక్రియ, న్యాయస్థానాల కేసులను అధిగమించి అమరావతి నిర్మాణాల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంతలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారం వైసీపీకి చిక్కింది. దీంతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అప్పటినుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిలిచిపోయింది. ఇక్కడకు వచ్చిన రియల్టర్లు హైదరాబాద్ వెళ్ళిపోవడం ప్రారంభించారు.ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది. త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కూటమికి ఐదేళ్లు ఛాన్స్ఉండడం, కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అంది అవకాశం ఉండడంతో శరవేగంగా నిర్మాణాలు పూర్తయ్య చాన్స్ కనిపిస్తోంది. మరోవైపు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు సైతం ఎగబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాదులో ఉన్న రియల్టర్లు ఇప్పుడు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు. గతంలో భూములు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు చదును చేయడం ప్రారంభించారు. కొందరు నిర్మాణాలకు సైతం ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి అమరావతిలో పెట్టుబడి పెట్టిన వారే హైదరాబాదులో రియాల్టర్లుగా ఉన్నారు. వారంతా ఇప్పుడు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అమరావతికి వస్తున్నారు. దీంతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. అమరావతి రాజధాని ప్రభావం భాగ్యనగరం పై స్పష్టంగా కనిపిస్తోంది.
అమరావతిలో మార్పుల్లేవు
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు మంత్రి నారాయణ రెండున్నరేళ్లలో అమరావతిలో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితమైన టైం బౌండ్‌తో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి.రాష్ట్ర రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు మంత్రి నారాయణ. చిన్న లిటిగేషన్ కూడా లేకుండా.. 34వేల ఎకరాలు సేకరిస్తే.. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. రైతుల కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదంటూ మంత్రి మండిపడ్డారు.మూడు ఫేజుల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు. ఫేజ్-1లో సిటీ వర్క్స్ అన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఫేజ్-2లో మెట్రో నిర్మాణం, రాజధాని కనెక్టివిటీ పనులు ఉంటాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పనులు రెండున్నరేళ్లలో పూర్తవుతాయని అంచనా వేస్తున్నామన్నారు నారాయణ.అమరావతి మొత్తం 217చదరపు కిలోమీటర్లు అన్నారు మంత్రి నారాయణ. ఇందులో చిన్న పెద్ద కలిపి.. 3వేల 600 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయని చెప్పారు. రోడ్లతో పాటు.. అధికారుల నివాసాలు, సెక్రటేరియేట్ కోసం కట్టే 5 భవనాలు, అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ అన్నారు మంత్రి.

Related Posts