YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ తప్పుడు అఫడవిట్ పై ఫైట్...

కేటీఆర్ తప్పుడు అఫడవిట్ పై ఫైట్...

హైదరాబాద్, జూన్ 17,
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితకు తోడు కేసీఆర్ కు కూడా పవర్ కొనుగోళ్లపై నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ ఆయన కొడుకు హిమాన్షు వంతు కూడా వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేటీఆర్ పై పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ లు విడివిడిగా కోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపించారు. అఫిడవిట్ ప్రకారం తనపై భార్య, మైనర్‌‌‌‌‌‌‌‌ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని అఫిడవిట్లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారని, గత ఏడాది జులైలో మేజర్‌‌‌‌‌‌‌‌ అయిన కొడుకు హిమాన్షు తనపై ఆధారపడలేదని తెలిపారన్నారు. అయితే సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం వెంకటాపూర్ లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసేందుకు హిమాన్షు వరుసగా రూ.10.50 లక్షలు, రూ.88.15 లక్షలు చెల్లించాడని , గత ఏడాది మేజర్ అయిన హిమాన్షుకు ఎవరి ఆర్థిక సహకారం లేకుండా అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. అఫిడవిట్లో నిజాలు దాచిన కేటీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.వాస్తవానికి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు బీ ఫామ్‌ అందుకోవడమే ఆలస్యం నామినేషన్‌ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అఫిడవిట్‎లో రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదని హెచ్చరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అందుకే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, తమపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అధికారికి ఇవ్వడంతో పాటు మీడియా ద్వార ప్రజలకు తెలపాలన్నది ఈసీ నిబంధన. ఇదే ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ విషయంలోనూ టెన్షన్ పెడుతోంది. ఒకవేళ ఏదైనా తప్పుడు సమాచారం దాస్తే.. ఆ తరువాత కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెంతున్నారు. నామినేషన్ సందర్బంగా దాఖలుచేసే అఫిడవిట్ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం సూచిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, అఫిడవిట్లలో చేసిన కొన్ని పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో ఈ సారి అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని ఎన్నికల ముందే ఈసీ అభ్యర్థులను హెచ్చరిస్తూ వస్తోంది.ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు దాఖలు చేసే అఫిడవిట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం. కఠిన నిబంధనలు విధించిన సంగతి విధితమే. అఫిడవిట్‌లో ఏ ఒక్క కాలమ్‌ను నింపకుండా ఖాళీగా ఉంచవద్దని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందుగా స్థానికంగా ఉన్న న్యూస్ పేపర్లు, న్యూచ్ ఛానల్స్‎లో ప్రకటనల ద్వారా క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ ముక్కూ మొఖం తెలియని పత్రికలు, ఛానల్స్‎లో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు లేదంటే గెలిచిన తరువాత అనర్హతకు గురవుతారని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.ఇప్పుడు కేటీఆర్ వ్యవహారంలో ఒకవేళ తప్పుడు సమాచారం అని తేలితే ఏం జరగుతుందో అని పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లో తప్పులు ఉంటే తర్వాత తిప్పలు పడాల్సి వస్తుంది. 2023లో కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ప్రత్యర్థులు కో ర్టుకు వెళ్లడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు. తర్వాత ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అభ్యర్థులు ఫారం–26లో అన్ని రకాల వివరాలను పొందుపర్చాలి. ఇందులో ఆస్తి, కేసులు, లావాదేవీల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Related Posts