అమరావతి జూన్ 17
కోట్ల రూపాయల ఫర్నిచర్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది. విపక్ష నేతలు దీనిపై విరుచుకు పడుతున్నారు. ఇంట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను వేధించిన కర్మఫలం మాజీ సీఎం జగన్ రెడ్డిని వెంటాడుతోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమన్నారు. ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఎలా ఒప్పుకుంటుందని నిలదీశారు. ఫర్నిచర్ కు కక్కుర్తి పడ్డ వాళ్ళు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుందని దేవినేని ఉమ అన్నారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? అనేది నాటి మంత్రివర్గ సభ్యులే చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు..