YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అశ్వాపురం కేంద్రంగా బెల్ట్‌ దందా ..

అశ్వాపురం కేంద్రంగా బెల్ట్‌ దందా ..

కొత్తగూడెం, జూన్‌17
వైన్‌ షాపు టెండరు దక్కించుకున్న లబ్ధిదారులు అంతా ఒక్కటై అశ్వాపురం గ్రామంలో ఎటువంటి అనుమతులు లేని ప్రైవేటు స్టాక్‌ పాయింట్‌ ని ఏర్పాటు చేసుకొని బెల్ట్‌ షాపులకు క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారు .ఒక్కొక్క వైన్‌ షాప్‌ కి వందకి పైబడి బెల్ట్‌ షాపులను ఏర్పాటు చేసుకొని ఈ దందా సాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాంయి.ఒక క్వాటర్‌ కి రూ.20 నుంచి 30 వరకు అధిక రేట్లకు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరంలోనూ బెల్ట్‌ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో గ్రామాలు, నగర శివారుల్లో ఈ దందా జోరుగా సాగేది. ప్రస్తుతం నగర నడిబొడ్డులోని కాలనీల్లో సైతం నడుస్తోంది. గతంలో గుడుంబా అమ్మకాన్ని, బెల్ట్‌ షాపులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించింది. ప్రభుత్వం నుంచి ఉపాధి లబ్ధి పొందిన వారు సైతం బెల్ట్‌ దందాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా వైన్‌ షాపుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైన్‌ షాపులు లిక్కరు దందాను కొనసాగించేందుకు బెల్ట్‌ షాపులను వారే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. వైన్‌ షాపులు సరుకు చేరవేస్తూ దానిపై కమీషన్లు ఇస్తూ కొత్త తరహాలో బెల్ట్‌ షాపులను నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌ దందాను కట్టడి చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ ఏమాత్రం  చర్యలు చేపట్టకపోవడం గమనార్హం  పినపాక నియోజకవర్గం లోని  పల్లెల్లో, మారుమూల గ్రామాలలో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. చీప్‌ లిక్కర్‌ అధికంగా ధరలు పెరగటం పెరగడంతో నియోజకవర్గంలోని మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు.  గుడుంబా కేవలం గ్రామాలు  పల్లెలు, పరిమితం కాకుండా పట్టణాలకు సైతం పాకింది.సరుకు భారీగా తీసుకువస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా ఎక్సైజ్‌, పోలీసుశాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే దందా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలే కాకుండా జిల్లా నలుమూలాల గుడుంబా, దేశిదారు అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో జిల్లాలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మద్యం వ్యాపారులు సైతం చెబుతుండడం గమనార్హం. గుడుంబా, దేశిదారు సరఫరాపై సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టిపెట్టకుండా అడపాదడప దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్టవేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికైనా విజిలెన్స్‌ అధికారులు నిద్రావస్థ నుండి మేల్కోని ప్రజలను కాపాడాలని,దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు ప్రజాసంఘాలు కోరుకుంటున్నారు.

Related Posts