YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్రమాల పుట్టగా మారిన నీట్ పరీక్షను రద్దు చేయాలి

అక్రమాల పుట్టగా మారిన నీట్  పరీక్షను రద్దు చేయాలి

హైదరాబాద్
వైద్య విద్యా ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష అక్రమాల పుట్టగా మారిన తక్షణమే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, ఎన్ ఎస్ యు ఐ నాయకులు బల్మూర్ వెంకట్, ఎస్ ఎఫ్ ఐ, ఏఐవైఎఫ్, పీ డి ఎస్ యు నాయకులు మహేష్, ధర్మేంద్ర యాదవ్, అరుణ్ లో నీట్ లో జరిగిన అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలు నిర్వహించే సంస్థను రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నిరసనగా ఈనెల 18న హిమాయత్ నగర్ లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల నివాసాలను ముట్టడిస్తామని తెలిపారు.

Related Posts