YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ ఈవీఎంలను హ్యాక్ చేయడం అసలు సాధ్యం కాదు

భారత్ ఈవీఎంలను హ్యాక్ చేయడం అసలు సాధ్యం కాదు

న్యూ డిల్లీ జూన్ 17
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల   వినియోగంపై బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్  చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  స్పందించారు. ఈ క్రమంలో మస్క్ ఆలోచన విధానం అమెరికా సహా ఇతర ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. కానీ భారతదేశంలో ఈవీఎంలను మాత్రం హ్యాక్ చేయడం అసలు సాధ్యం కాదన్నారు.అమెరికాలో ఇంటర్నెట్ ఆధారంగా ఓటింగ్ మిషన్లు) పనిచేస్తాయని, ఇండియాలో మాత్రం వీటిని బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి ఏ మార్గాల ద్వారా కనెక్ట్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఈవీఎంలను రీప్రోగ్రామ్ చేయడం సాధ్యం కాదని వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైతే ఎలాన్ మస్క్‌కి ట్రైనింగ్ కూడా ఇస్తామని, వీటిని మీ దేశంలో కూడా తయారు చేయవచ్చని చంద్రశేఖర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Related Posts