కోల్ కతా జూన్ 17
పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త బాధ కలిగించింది.కాగా ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతులకు ఎక్స్‌గ్రేషియాను పెంచారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హుటాహుటిన డార్జిలింగ్ చేరుకున్నారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రకటించారు. ఆ తర్వాత ఎక్స్‌గ్రేషియా పెంపును అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.