YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వానొస్తే... హైడర్ బాద్...

వానొస్తే... హైడర్ బాద్...

హైదరాబాద్, జూన్ 18,
హైదరాబాద్ నగరం పేరుకు విశ్వనగరం..వానొస్తే నరకం. కొద్దిపాటి వానస్తే చాలు మెయిన్ రోడ్డలలో నీరు నిలిచిపోతుంది. దీనితో వాహనదారులు నానా యాతన పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యపై ఏనాడూ దృష్టి పెట్టకపోవడంతో వానాకాలంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతన్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఖరీదైన వస్తువులన్నీ పాడైపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇకపై ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేశారు. నెల రోజుల వ్యవధిలో దీనికి సంబంధించిన పనులను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్ద సంపు తవ్వి అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సంప్‌ నుంచి నీటిని మోటార్లు ద్వారా సమీపంలోని అతిపెద్ద నాలాలకు తరలిస్తారు.ఏకధాటిగా 2సెం.మీ.ల వర్షం పడితే చాలు దాదాపు 50చోట్ల చెరువుల్లా మారుతున్నాయి. ఇందులో 20 వరకు ప్రధాన ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలుస్తోంది. మొదటి దశలో 12 చోట్ల సంపులు నిర్మించాలని నిర్ణయించారు. పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరుకే పనులు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గంలో పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే కింది భాగంలో పిల్లర్‌ నంబర్‌ 264 శివరాంపల్లి దగ్గర భారీ వర్షం పడితే ఈ ప్రాంతం చెరువుగా మారుతోంది. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా దీనికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 1.50లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపును నిర్మించనున్నారు. ఈ నీటిని వెంటవెంటనే మోటార్ల ద్వారా బుల్కాపూర్‌ నాలాలోకి తరలిస్తారు.హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నీరు నిల్చే ప్రాంతాల్లోనూ ఇలాగే సంపుల నుంచి సాగర్‌లోకి పంపించనున్నారు.రాజ్‌భవన్‌ రోడ్డులోని లేక్‌ క్యూ అతిథి గృహం దగ్గర సంపును తవ్వబోతున్నారు. మొదటి దశ పనులు పూర్తయిన తరువాత రెండో దశలో మరికొన్నిచోట్ల నిర్మించాలని నిర్ణయించారు
సిటీలో 25 వేలకుపైగా మ్యాన్ హోల్స్
హైదరాబాద్ లోని రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రతీరోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదువుతూనే ఉంటాయి. ఇక వర్షం కురిసిందంటే కిలో మీటర్ దూరం వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. దీనికితోడు ఎక్కడ మ్యాన్ హోళ్లు ఉంటాయోనన్న ఆందోళన. పలువురు వాహనదారులు మ్యాన్ హోళ్లలో పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్ హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును అద్దుతోంది.గ్రేటర్ పరిధిలో మొత్తం 25వేలకుపైగా లోతైన మ్యాన్ హోళ్లు ఉన్నాయి. వీటిపై సేప్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతోపాటు, వాటిని ప్రజలు తేలికగా గుర్తించేందుకు ఎరుపు రంగు పూస్తున్నారు. తద్వారా వానా కాలంలో, వర్షాలు పడిన సమయంలో మ్యాన్ హోళ్లలో పడకుండా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పుడు రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఆ నీరు వెళ్లుందుకు కొందరు మ్యాన్ హోళ్లను తెరుస్తుంటారు. తద్వారా వాహనదారులకు ప్రమాదం పొంచిఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దీనికితోడు మ్యాన్ హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జలమండలి చట్టం 1989 సెక్షన్ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్ హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. దీంతో ఎవరైనా తమ ఇష్టానుసారంగా ఎరుపు రంగువేసిన మ్యాన్ హోల్స్ తెరిస్తే ఇక నుంచి జైలు ఊచలు లెక్కించాల్సిందే. నగర వాసులు ఎరువు రంగు వేసిన మ్యాన్ హోల్స్ జోలికి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లకండి. మరోవైపు సీవరేజ్ సమస్యలు ఉంటే ప్రజలు లమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Related Posts