గుంటూరు
పోలవరం ప్రాజెక్టు దుస్థితికి సీఎం చంద్రబాబే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఆయన విస్మరించారని విమర్శించారు. 'జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. పోలవరానికి ఆయన ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మా పాలనలో ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదు. జగన్పై బురద చల్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది' అని ఆయన మండిపడ్డారు.