విజయవాడ, జూన్ 19,
2019లో 151.. 2024లో 11.. ఇది వైసీపీ పార్టీ సీట్ల లెక్క. ఆస్మాన్.. జమీన్ ఫరక్ ఉంది ఈ లెక్కలో.. అప్పుడేమో ఎవరిని లెక్క చేయని ఆ పార్టీ నేతలు, అధినేతకు.. ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్ అపోజిట్‌గా మారిపోయాయి. ఈ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటోంది అధికార టీడీపీ పార్టీ.. గడచిన ఐదేళ్లలో వారు చేసిన ఒక్కో వ్యవహారాన్ని పక్కా ఆధారాలతో సహా బయటపెడుతుంది. దీంతో జనాల్లో ఇప్పటికే పలుచైన వైసీపీ పార్టీ పరువు.. పూర్తిగా గంగలో కలిసే పరిస్థితి వచ్చింది. రుషికొండపై భారీ భవనం నిర్మాణం.. నిజంగా ఈ భవనాన్ని ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఎవరికోసం నిర్మించారు? ఈ విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడిదే ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. నిజానికి జగన్ పర్సనల్ విషయాలతో పాటు.. ఇలా ప్రభుత్వానికి అంటే ప్రజలకు సంబంధించిన విషయాలపై చాలా సీక్రెట్‌గా ఉంచారు. దీంతో ఆ కొండపై నిర్మించే భవనంలో ఏముందా? అనే క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది. నిజానికి జగన్ ఓడిపోకపోయింటే అందులో ఏముంది? అనేది ఎప్పటికీ తెలిసేది కాదు.కానీ ఇప్పుడు ఓటమితో టీడీపీ.. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. ఆ ప్యాలెస్ వివరాలను ప్రజలకు రీవిల్ చేసింది. దీంతో.. ఇంత ఖర్చు పెట్టి జగన్ నిర్మించారా అనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. అయితే ఇది జగన్ తన కోసమే నిర్మించుకున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. కానీ అది ప్రభుత్వ ఆస్తి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ అసలే పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన సమయంలో ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి ఇంత భారీ భవనం నిర్మించడం అవసరమా? అది కూడా జగన్ నివసించేందుకు ఎందుకు? ప్రజాధనాన్ని జగన్ ఎందుకు వృథా చేశారు? ఇంత భారీ హంగు, ఆర్భాటం ఎందుకు? ఇలా అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇన్నాళ్ల పాటు తాడేపల్లి ఏరియా మొత్తం ఆంక్షల వలయంలో ఉండేది. అటు వైపు సీఎం, వైసీపీ వారికి తప్ప.. సామాన్య జనం అడుగు పెట్టేందుకు అవకాశం కూడా ఉండేది కాదు. అఫ్‌కోర్స్ సీఎం ఉండే చోట కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ.. ఈ ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సామాన్య ప్రజలు. కానీ ఆంక్షలు ఎత్తివేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరికి వెళ్లే విశాలమైన రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తీరాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి ఐదు కిలోమీటర్ల వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు బారికెడ్ల తొలగింపు.. ఆంక్షల ఎత్తివేతతో ప్రజల కష్టాలకు చెక్ పడ్డట్టైంది. ఇవన్ని బయటికి కనిపించని విషయాలు. అయితే ఇప్పుడు వైసీపీ పెద్దలు కొన్ని కనిపించని శక్తులు, భయాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం టీడీపీ టార్గెట్ వైసీపీని భూస్థాపితం చేయడం. అంటే బయటికి చెప్పడం లేదు.. కానీ ఆ పార్టీ నేతల ఉద్దేశం అదే.. ఇప్పటికే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఆ పార్టీలో.. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు.. మిగిలిన ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వైసీపీ నేతల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు వైసీపీని వీడారు. ఇప్పుడు ఓడిపోవడం.. టీడీపీ రీవెేంజ్ పాలిటిక్స్ చేస్తుందన్న భయాలు. తప్పు జగన్ చేస్తే తాము ఎందుకు శిక్ష అనుభవించాలన్న ఆలోచనలు. ఇలా రకరకాల ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అనవసరంగా ప్రభుత్వ పెద్దల ఆగ్రహాలకు బలికావడం ఎందుకు అనే థాట్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో వైసీపీ పెద్దలు ఉన్నవారిని కాపాడుకోవడంపై ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీలను కాపాడుకోవడం ఇప్పుడు వైసీపీకి చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి అంతో ఇంతో పట్టు ఉన్నది అంటే అది కేవలం మండలిలోనే.. సో.. ఎమ్మెల్సీలు కనక జగన్ చేజారిపోతే.. ఇక చట్టసభల్లో వైసీపీ అనే పేరు కనుమరుగైపోతుంది. అందుకే గతంలో మండలి దండగ అనే స్టేట్‌మెంట్స్‌ను పక్కన పెట్టి.. ఇటీవల తన ఫోకస్‌ను ఎమ్మెల్సీలపైకి షిఫ్ట్ చేశారు జగన్.. వారితో భేటీ నిర్వహించారు. పోరాటం అప్పుడే అయిపోలేదు అని హిత భోధ చేశారు. వైసీపీ నేతలను కంగారు పెట్టే మరో అంశం రెడ్ బుక్.. విపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ రెడ్ బుక్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు లోకేష్. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ఒక్కో నేత, అధికారి పేరును తాను నోట్ చేసుకున్నానని అధికారంలోకి రాగానే అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు.. సో ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నారు.. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్నారు. అంతేకాదు తాము చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నామంటున్నారు లోకేష్. కానీ టీడీపీ మాత్రం పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. సామ, దాన, బేధ, దండోపాయాలు అన్నట్టుగా వైసీపీని చుట్టుముడుతోంది. ఇటు ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు.. చేసిన పనులను ప్రజల్లో ఎండగడుతూనే.. కేసుల చిక్కువలను సిద్ధం చేస్తోంది. అయితే.. ఇది ఆరంభం మాత్రమే.. ముందు ముందు ఫ్యాన్ పార్టీకి భరించలేనంత ఉక్కపోత ఖాయం.