YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

3 రాజభవనాలు...రుషికొండ నిర్మాణాలు 425 కోట్ల వ్యయం... రాజసం ఉట్టిపడేలా ప్యాలెస్ మైండ్ బ్లాంక్...

3 రాజభవనాలు...రుషికొండ నిర్మాణాలు 425 కోట్ల వ్యయం... రాజసం ఉట్టిపడేలా ప్యాలెస్ మైండ్ బ్లాంక్...

విశాఖపట్టణం, జూన్ 19,
మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్లు విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు పట్టుకున్న లక్షలాది రూపాయలు.. ఇది పేదల ప్రతినిధిగా చెప్పుకునే పెత్తందారీ భవనం. విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ లు బహుళ ప్రపంచంలోకి వచ్చాయి. గత ఐదేళ్లుగా పెత్తందారీ వ్యవస్థతో పోరాడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రాజసౌధం చూస్తే జగన్ ఆలోచన ఏంటన్నది ఇట్టే తెలిసిపోతుంది. తనకోసం రాజభవనాలను తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ లు కొట్టుకోవడం.. దానిని గుట్టుగా సాగించడం.. ఇప్పుడు అధికార మార్పిడితో వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది. ఏకంగా 452 కోట్లతో విలాసవంతమైన భవనాలు కట్టారు. వాటిలో ఏకంగా 12 బెడ్ రూములు నిర్మించారు. ప్రతి బెడ్ రూమ్ కు ఒక అటాచ్ బాత్రూంను నిర్మించారు. ఆ బాత్రూం లో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి నిర్మాణం ప్రత్యేకత సంతరించుకున్నదే. దాని వైశాల్యం 480 చదరపు అడుగులు. అంటే పేదలకు జగన్ ఇచ్చిన ఇంటి స్థలం కంటే అధికం. ప్యాలెస్ లో ప్రతి అడుగు రాజసం ఉట్టిపడేలా ఖరీదైన నిర్మాణాలు చేపట్టారు. ఋషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే 407 కోట్లు ఖర్చు పెట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను కూడా తెచ్చారు. మళ్లీ తానే గెలుస్తానని.. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ కలలుగన్నారు. రాజధానిని విశాఖకు మార్చేసి రిషికొండపై కొలువు తీరాలన్నది జగన్ లక్ష్యం. గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు. జగన్ నివాసంతో పాటు సీఎం కార్యాలయం కోసం ఈ భవంతులను కట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ డాలర్లు వెచ్చించి కొట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నేలా వీటిని నిర్మించారు. రాజధాని అవసరాల కోసం వీటిని నిర్మాణం చేపడుతున్న కొందరు మంత్రులు మాత్రం రిసార్టు లేనని బుకాయించారు. అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించేలా నాటకం ఆడారు. విశాఖలో మిగతా భవనాలను పరిశీలించి అన్నింటికీ రిషికొండ భవనాలు ఆమోదయోగ్యమని గ్రామ పండించారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి సేవలను వినియోగించుకున్నారు. ఆ కమిటీకి నేతృత్వం వహించే ఆమె చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ భవనాలు సీఎం నివాసంతో పాటు కార్యాలయానికి వినియోగించుకోవచ్చని సూచించారు. కానీ వారు ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది. వైసిపి ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ పేదల సీఎం చేపట్టిన నిర్మాణాలు బయటకు వచ్చాయి. వైసిపి అధికారంలో ఉన్నన్నాళ్లు అటువైపుగా చీమకు కూడా ప్రవేశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందలాది మంది పోలీసులను మొహరించి అడ్డుకుంది. తాజాగా మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకుల బృందం, మీడియా ప్రతినిధులను తీసుకుని ఆదివారం రుషికొండ భవనాలను సందర్శించారు. దీంతో విలాసవంతమైన భవనాల వ్యవహారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇదే ఏపీలో వైరల్ అంశంగా మారింది. ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఇన్ని రోజులు రహస్యంగా సాగిన నిర్మాణ ప్రక్రియ వెలుగులోకి రావడంతో వైసీపీ శ్రేణులు కూడా ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎప్పటికీ జగన్ కు బెంగళూరు, హైదరాబాదు, పులివెందుల, తాడేపల్లిలో రాజభవనాలను తలదన్నే భవంతులు ఉన్నాయి. అవి చాలా ఉన్నట్టు ఇప్పుడు రిషికొండపై పడ్డారు. అయితే జగన్ ఆడిన డ్రామాలో ఐదారు గురు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ క్యాబినెట్ అనుమతి తీసుకున్నారు.ఇప్పటి వరకు రాజులు, రాజ భవనాలు, రాజ సౌధాలు గురించి కథలుగా తెలుసుకున్నాం. కానీ తొలిసారి విశాఖలో జగన్ కట్టిన రుషికొండ రాజ సౌధంలో నిర్మాణాలు గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతోంది.ప్రతి నిర్మాణం ప్రత్యేకమే. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. ఈ భవనాల్లో అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 1312 రకాల వస్తువులను వినియోగించారు. శ్వేత వర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశ ద్వారాలు, విలాసమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసుకొని స్నానాలు గదులు.. ఇలా అన్నీ ప్రత్యేకమే. కేవలం భవనాలే కాదు.. ప్రాంగణమంతా ఖరీదైన పచ్చికలు, విలాసమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. కనుచూపుమేరలో విశాలమైన నీలి సముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు.కళింగ బ్లాక్ లో రెండు భవనాలను సీఎం కార్యాలయం కోసం నిర్మించారు. గజపతి, వేంగి బ్లాక్ లను సహాయ సిబ్బంది, ఇతర అధికారుల కోసం నిర్మించారు. భవనాలను భారీ స్తంభాలు, ప్రాకారాలతో ఇంద్ర భవనాల తీర్చిదిద్దారు. భవనాలను అనుసంధానిస్తూ విశాలమైన నడవాలు నిర్మించారు. అన్ని గోడలకు విదేశాల నుంచి తెచ్చిన పాలరాయి తాపడం చేశారు. ఏ భవనం చూసినా శ్వేత, ముదురు గోధుమ వర్ణాలతో మెరిసిపోయేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారాలను వదడుగుల ఎత్తులో, అంతే వెడల్పుతో భారీగా ఏర్పాటు చేశారు. వాటికి ఇరువైపులా పాలరాయి నిర్మాణాలతో కూడిన ఎత్తైన ఆకృతులను చెక్కారు. బాత్రూములకు సైతం సెంట్రలైజ్డ్ ఏసి ఏర్పాటు చేశారు. భవనాల్లో వినియోగించిన ఫ్యాన్లు, షాండ్లియర్లు, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఒక్క ఫ్యాన్ ధర రూ.35 వేల నుంచి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. షాండ్లియర్ల ధర ఒక్కొక్కటి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 12 బెడ్ రూములు వేరువేరుగా మంచాలు ఏర్పాటు చేశారు. ఈ గదులకు చుట్టూ ఆటోమేటిక్ అద్దాల తలుపులు, బయట నుంచి ఎండ లోపలికి రాకుండా ఆటోమేటిక్ కర్టెన్లు ఏర్పాటు చేశారు. హాలుకు రెండు వైపులా భారీ సోఫా సెట్లు ఏర్పాటు చేశారు. ఓపెన్ కిచెన్, సముద్రాన్ని చూస్తూ భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించారు. రెండు వైపులా అతిథులు, సన్నిహితులతో ఏకాంతంగా మాట్లాడుకునేందుకు మరో రెండు గదులను నిర్మించారు. బాత్రూముల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటిలో ప్రత్యేకంగా స్పా ఏర్పాట్లు చేశారు. కమోడ్లు, షవర్లు, కుళాయిలు అన్ని ప్రసిద్ధ జపాన్ కంపెనీలకు చెందినవే. బాత్రూంలో భారీ కబోర్డులు ఏర్పాటు చేశారు. 100 అంగుళాల భారీ టీవీలను సైతం అమర్చారు. విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్, గ్రానైట్ ను మాత్రమే వినియోగించారు. ఇక జగన్ కుటుంబం కోసం నిర్మించిన మూడు జిల్లాలు సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. పూర్తి విదేశీ పరిజ్ఞానంతోనే ఈ నిర్మాణాలు సాగినట్లు తెలుస్తోంది.

Related Posts