YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గంజాయిపై ఉక్కుపాదం

గంజాయిపై ఉక్కుపాదం

విశాఖపట్నం
రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత ఆదేశాలతో, డిజిపి ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు అలెర్ట్ అయ్యారు.  గంజాయి, ఇతర మాధాకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ మేరకు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డి. సి. పి.. 2 మోకా సత్తిబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.  ఇక నుండి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై తనిఖీలు నిర్వహించి, మాదక రహిత కేంద్రంగా విశాఖ జిల్లాను ఉంచుతామని అన్నారు. 24 గంటలు సరిపిళ్లి వద్ద చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుందని అన్నారు. కళాశాలలో తనిఖీలు నిర్వహించి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని డి. సి. పి. పేర్కొన్నారు.  ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ప్రత్యేక ద్రుష్టి పెడతామని అన్నారు..కళాశాలల్లో విద్యార్థులకు మానసిక వైద్యులతో, తరగతులు నిర్వహిస్తామని అన్నారు.. ఈ డ్రగ్స్ మాఫియాను 100 రోజుల్లో గంజాయి వినియోగా న్ని అరికట్టడమే లక్ష్యంగా విశాఖ పోలీసులు పనిచేస్తామని అన్నారు..నగరంలో ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో 5 నుండి పది ప్రాంతాలలో నిఘా పెడతామని అన్నారు.. ఈ విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని అన్నారు.. గంజాయి వినియోగంతో ఎవరయినా సరయిన సమాచారం ఇస్తే, వారి వివరాలను గొప్యంగా ఉంచడంతో పాటు, పోలీసు శాఖ నుండి వారికి పారితోషికం కూడా అందిస్తామన్నారు డి. సి. పి. మోకా సత్తిబాబు స్పష్టం చేశారు.

Related Posts