YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బల్కంపేట అమ్మవారి కళ్యాణం ముహుర్తం పిక్స్

బల్కంపేట అమ్మవారి కళ్యాణం ముహుర్తం పిక్స్

హైదరాబాద్, జూన్ 19,
భాగ్యనగర వాసులకు కొంగు బంగారంగా ప్రసిద్దిగాంచిన బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం కూడా ఆషాడ మాసంలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. హిందూ తెలుగు చాంద్రమానం ప్రకారం బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాడ మాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది అమ్మవారి కళ్యాణం ఎప్పుడు జరగనుందో తెలుసుకుందాం..తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ. బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం. ఈ ఏడాది అమ్మవారి కల్యాణాన్ని 2024 తేదీ జూలై 9న నిర్వహించనున్నారు. మర్నాడు అంటే 2024 తేదీ జూలై 10న రథోత్సవాన్ని జరపనున్నారు. పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్దిగాంచిన ఎల్లమ్మ దేవిని రేణుకా దేవి, జల దుర్గా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అమ్మవారి విగ్రహం దాదాపు 10 అడుగులు భూమి క్రింద నీటితో చుట్టుముట్టబడిన శయన స్థితిలో ఉంటుంది.ఎల్లమ్మ తల్లి కళ్యాణం శక్తి మాతను మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ కళ్యాణం చూసి తీర్ధప్రసాదాలు స్వీకరించిన భక్తుల కోరిన కోర్కెలు తీర్చడంతోపాటు పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్మకం. అందుకంటే అమ్మవారి వార్షిక ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి అమ్మవారికి పట్టు వస్త్రాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది. కల్యాణం జరిగిన మర్నాడు వార్షిక రథోత్సవం జరుగుతుందిఉత్సవాల్లో భాగంగా భక్తులు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రధానంగా అమ్మవారికి చీరలు, గాజులతో పాటు ఇతర సౌందర్య ఉత్పత్తులను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు. కొంతమంది భక్తులు వేప ఆకులతో అలంకరించిన పాల కుండలను తీసుకువెళతారు. ఉత్సవాల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తారు.
కర్రపూజ పూర్తయింది...70 అడుగుల గణేశుడు
వినాయక చవితి కోసం ఖైరతాబాద్‌లో నెలకొల్పే భారీ గణపతి విగ్రహం ఎత్తు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ అత్యంత ఎత్తైన విగ్రహం తయారీ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిష్ఠించి, పూజలందుకొని నిమజ్జనం జరిగే వరకూ ఏటా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తయారీ కోసం తొలుత కర్ర పూజ నిర్వహించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఆ కర్రపూజను నేడు నిర్వాహకులు జరిపారు.ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ రానుంది. అప్పుడు ప్రతిష్ఠించబోయే భారీ గణనాథుడి విగ్రహ తయారీ పనులు ఇప్పటి నుంచే తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ వినాయక విగ్రహం ఏర్పాటుకు కర్ర పూజ జరిగింది. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు.కర్రపూజ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని.. సంప్రదాయం ప్రకారం నేడు కర్రపూజ చేసి విగ్రహం తయారీని ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయాన్ని చెప్పారు. దాని ప్రకారం అన్ని విభాగాలను సిద్ధం చేస్తున్నామని.. రాబోయే రెండుమూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశం జరుపుతామని దానం నాగేందర్ చెప్పారు. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని దానం నాగేందర్‌ చెప్పారు.ఖైరతాబాద్ గణపతిని నెలకొల్పడం మొదలుపెట్టి.. ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వహకులు నిర్ణయించినట్లు దానం చెప్పారు. గతేడాది ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.

Related Posts