YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

5 నెలలు..18 లక్షల ఉల్లంఘనలు

5 నెలలు..18 లక్షల ఉల్లంఘనలు

హైదరాబాద్, జూన్ 18,
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు వాహనదారులు. వివిధ కారణాల చేత పట్టుబడిన వాహనదారులు ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నా తమకేంటిలే అన్న ధీమాని వ్యక్తం చేస్తూ.. వాహనదారులు ప్రయాణిస్తున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ చెకింగ్ పాయింట్స్ ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రూల్స్‎ను అతిక్రమిస్తూ ప్రయాణం చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నగరంలో పెరిగిపోవడంతో.. ఐదు నెలల్లోనే 18 లక్షలకు పైగా కేసులను నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.హెల్మెట్ ధరించరు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు సీసీ కెమెరాలు ఉన్నా వాటి కళ్ళు కప్పి నెంబర్ ప్లేట్లను సైతం కనపడుండకుండా మాస్కులతో.. చున్నీలతో కవర్ చేస్తారు. ఎన్ని సమావేశాలు, సదస్సులు నిర్వహించినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు వాహనదారులు. ఈ ఏడాది వ్యవధిలోని ఏకంగా 18 లక్షలకు పైగా కేసులను నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలో చాలా ప్రాంతాల్లో యూటర్న్లు ఎక్కువగా దూరంగా ఉండడంతో.. రాంగ్ రూట్లోకి వెళ్లి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు లేకపోవడం, రాంగ్ పార్కింగ్ ఈ విధంగా ఎన్నో కేసులను నమోదు చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ ఏమాత్రం చలనం లేకుండా తమ ఇష్టానుసారంగా వెళుతూ ఉన్నారు. వాహనదారులు అయితే 2023లో 9,40, 670 కేసులు హెల్మెట్ లేని వారిపై కేసులను నమోదు చేయగా 2024లో 11,46,698 కేసులను నమోదు చేశారు. ఈ విధంగా 2023లో 14,27,933 కేసులు నమోదు కాగా ఈ ఐదు నెలల్లో 18 లక్షలకు పైగా కేసులను నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. దీనిని బట్టి చూస్తే ఈ రూల్స్‎ను మరింత కఠినతరం చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలి అని కొంతమంది వాహనదారులు తెలియజేస్తున్నారు.
నగరంలో గంజాయి చాక్లెట్లు
గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్మడం ట్రెండింగ్‌గా మారింది. ఆశా చాక్లెట్, న్యూట్రిన్ చాక్లెట్, క్యాడ్‌బరీ చాక్లెట్‌లాగే గంజాయి చాక్లెట్‌ కూడా మార్కెట్‌లో ఈ మధ్య కనిపిస్తుంది. గంజాయితో తయారైన మాయదారి చాక్లెట్ ముక్కలివి. చాక్లెట్టే కదా అని ఓపెన్ చేస్తే… లోపల నల్లటి పదార్థం.. గుప్పుమన్న గంజాయి వాసన. ఒక్కో చాక్లెట్ ధర మినిమమ్ 15 రూపాయలు. మాగ్జిమమ్ 30 రూపాయలు.  మొదట్లో ఫ్రీగానే ఇచ్చి తియ్యటి మాటలతో చిన్నపిల్లల్ని మచ్చిక చేసుకుంటారు.. వాళ్లు కొద్దికొద్దిగా బానిసలుగా మారాక.. పైసలిస్తేనే చాక్లెట్లంటూ కౌంటర్లు తెరుస్తారు.  మత్తు చాక్లెట్లు తయారుచెయ్యడం, తెలిసిన వాళ్లకి మాత్రమే అమ్మడం, స్కూల్స్, కాలేజీల దగ్గర పాన్‌ డబ్బాలే అడ్డాలుగా చిన్నపిల్లలే టార్గెట్‌గా అమ్మకాలు జరపడం.. ఇలా కల్చర్ ఇప్పుడు గుబులు రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లను శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ ప్రాంతంలో ప్రతి శనివారం జరిగే పార్టీలపై ఎక్సైజ్‌ పోలీసులతో కలిసి డ్రగ్ టాస్క్‌ఫోర్స్ బలగాలు సోదాలు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బైక్‌పై గంజాయి చాక్లెట్స్‌ తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.7 లక్షలు విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోన్న దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Related Posts