YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి

విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి

హైదరాబాద్
తెలంగాణలో  విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా  అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు.  మలక్ పేట కళ్యాణ్ నగర్ లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశం లో  మాట్లాడుతూ   విద్య హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్.కార్పొరేట్ పాఠశాలలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్నారు.
ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు ప్రోత్సహించడం వలన విద్యా వ్యాపారంగ మారిందని ఆరోపించారు. పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాల్సిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వాటి పేరుతో వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు వేలాది రూపాయలు ఫీజులు వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోరావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తరగతుల వారీగా ఫీజు నిర్ణయించి అట్టి ఫీజులను నోటీసు బోర్డుపై ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలో డ్రస్సులు, పుస్తకాలు అమ్మే విధానాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు. కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలపై  చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక రెగ్యులేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 20 నుంచి 50% ఫీజులు పెంచుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలన్నారు. ఒకే పేరుతో వందలాది బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయాలన్నారు.  ఇరుకైన గదుల్లో సేఫ్టీ లేని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీటి అమలు కోసం ప్రభుత్వం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి సమర్పించినట్లు స్పష్టం చేశారు..  ప్రభుత్వం స్పందించక పోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Related Posts