YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్

హైదరాబాద్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.  అప్పులు చేసి సంపద సృష్టిస్తాం, ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది.. త్వరలోనే పనిచేసిన వారికి పదవులు అందుతాయి . రైతు రుణమాఫీకి పూర్తిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కుల గణనా చేపట్టాలి తద్వారా దేశ సంపద వనరులు పంచబడాలి. పాలనలోను భాగస్వాములను చేయాలని మా డిమాండ్ అని అన్నారు.
మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతాం
విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలని నిండు సభలో వాటి విద్యుత్ శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి కోరారు.. న్యాయ విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అర్థం కావడం లేదు. ఇదేశ సంపద వనరులు దామాషా ప్రకారం పంచబడాలని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. జనాభా దామాషా ప్రకారం సంపద పదవులు పంచాలని ఆయన ఎన్నికల ముందు కోరారు.. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలు అమలు చేస్తున్నాం.  రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాము వారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం.  దేశంలో కులగణను జరగాలని రాజీవ్ గాంధీ ఇచ్చిన పిలుపు విప్లవాత్మకమైనదని అన్నారు.

Related Posts