విజయవాడ
వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ కు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు నువ్వు ఓడిపోగానే గుర్తుకు వచ్చిందా. రాష్ట్ర ప్రజలు నిన్ను మనిషిగా కూడా లెక్క వేయడం మానేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనిషిగా మారతావని ఆశిస్తున్నాము అని తీవ్ర పదజాలంతో వైయస్ జగన్ కు ట్యాగ్ చేసి వీడియోను పోస్ట్ చేసారు నెట్టెం రఘురామ్. జగన్ ఒక ఫర్నిచర్ దొంగ అని హాష్ ట్యాగ్ జతచేసిన ఈ ట్విట్ నెట్టింట వైరల్ అవుతుంది