YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి నిధుల వరద పారుతోందా...

ఏపీకి నిధుల వరద పారుతోందా...

విజయవాడ, జూన్ 20,
చంద్రబాబు గెలిచారు. సీఎం అయ్యారు.  వెంటనే ఐదు సంతకాలు పెట్టారు. కానీ  చాలా మంది సంతకాలు పెడితే పనైపోతుందా అమలవ్వాలి కదా అని మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే ఏపీ ఆర్థిక పరిస్థితి అలా ఉంది మరి.  జగన్మోహన్ రెడ్డి ప్రతీ వారి ఆర్బీఐ ముందు కనీసం నాలుగు వేల కోట్ల అప్పుల కోసం నిలబడేవారు. వాటికి తోడు కనిపించిన ప్రతీ ఆస్తి తాకట్టు పెట్టేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.   ఆదాయం పెరగలేదు. మరి ఎలా అమలు చేస్తారన్నదే సందేహం. ఏపీ కంటే మెరగైన ఆర్థిక పరిస్థితి ఉన్న తెలంగాణలో మాత్రం పథకాల అమలుకు తంటాలు పడుతున్నారు. చంద్రబాబు పాలన మొదలైంది నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు   తొలి నిర్ణయాలుగా   ఏకంగా ఐదు ఫైల్స్‌పై సంతకం చేశారు చంద్రబాబు. తొలి సంతకం  మెగా డీఎస్సీ తాను అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌పై తొలి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తొలి సంతకం చేశారు. పెన్షన్ల పెంపు సహా మరో మూడు సంతకాలు పెట్టారు.  ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే.  ముఖ్యంగా సామాజిక పెన్షన్లు. ఇప్పుడు నెలకు పందొమ్మిది వందలకోట్ల వరకూ ఖర్చు అవుతున్నాయి. అది  వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మూడు వేల కోట్లపైనే అవుతుంది. అదేమీ చిన్న మొత్తం కాదు.   250 పెంచడానికి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల సమయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు ఒక్క సంతకంతో వెయ్యి పెంచారు. ఇతర విభాగాల వాళ్లకు పదిహేను వేలుదాకా చేశారు. ఇక మెగా డీఎస్సీ కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఖర్చులను పెంచేవే.  ఇంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో  చంద్రబాబు ఎలా హామీలు చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష చేశారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.  అయితే సీఎం ఆషామాషీగా చేసి ఉండరని ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.   కేంద్రం నుంచి అందే సహకారం..  ఆటోమేటిక్ గా ఏపీలో పెరిగే పెట్టుబడులు, వ్యవహారాలు, వైసీపీ నేతలు దోచిన ఆదాయాన్ని నిలిపేయడం ద్వారా సర్కార్ కు పెరిగే ఆదాయం వంటి వాటివి అంచనా వేసుకునే హామీల అమలు ప్రారంభించారని భావిస్తున్నారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవుల కోసం పట్టుబట్టలేదు. బీజేపీ ఎన్ని ఇస్తే అన్నే తీసుకున్నారు. రాష్ట్రం కోసమే తాను రాజకీయం చేస్తానని అంటున్నారు. ఆయన ప్రధానంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరుకున్నారని ఆ మేరకు హామీ వచ్చిందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఏపీతో  పాటు ఎన్డీఏలో మరో కీలక భాగస్వామి అయిన జేడీయూ నేత నితీష్ సీఎంగా ఉన్న బీహార్‌కు సాయం అందబోతోందని చెబుతున్నారు. ఇలాంటి ఓ రిపోర్టుపై .. కేటీఆర్ స్పందించారు ప్రాంతయ పార్టీల వల్ల అదే లాభమన్నారు.  మరో వైపు ఏపీలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో  తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీ అంత విరివిగా పథకాలు అమలు చేయగలిగినప్పుడు మెరుగైన ఆర్థికపరిస్థితి ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణకు గత ప్రభుత్వం  చేసిన అప్పులకు కట్టాల్సిన వాయిదాలు పెనుభారంగా ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పు భారంగా  మారింది. అదే సమయంలో ఆర్బీఐ నుంచి తీసుకొచ్చే అప్పుల్ని తగ్గించుకున్నారు. తీసుకునే అప్పుల కన్నా తిరిగి చెల్లించేవే ఎక్కవగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజలకు ఈ కారణాలు నచ్చవు.. వారికి ప్రభుత్వం హామీలు అమలు చేసిందా లేదా అన్నదే ముఖ్యం.చంద్రబాబు సంతకాలు చేశారు కానీ ఇంకా అమలు కాలేదు. సంతకాల పవర్ మరో పదిహేను రోజుల నుంచి తేలనుంది. ఆ  రోజున... ఒక్కో పెన్షన్ దారునికి ఏడు వేలు ఇస్తారు. ఆ తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తారు. అవి చేతికి అందితే...  చాలా వరకూ సక్సెస్ అయినట్లే.  లేకపోతే ఇబ్బందికరమే.  ధనిక రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఏపీతో పోలిస్తే చాలా తక్కువే అప్పులు చేశారు.  అయినా రేవంత్ సర్కార్ హామీల అమలు కోసం కిందా మీదా పడుతుంది. చంద్రబాబుకు ఏ సమస్యలూ లేకపోతే.. రాకపోతే ఆయన గొప్పతనమే అనుకోవచ్చు.

Related Posts