YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బ్యాంకుల నుంచి కదులుతున్న ఫిక్సిడ్ డిపాజిట్లు

బ్యాంకుల నుంచి కదులుతున్న ఫిక్సిడ్ డిపాజిట్లు

గుంటూరు,  జూన్ 20,
ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఐదేళ్లుగా పీడిస్తున్న స్తబ్దత మెల్లగా వీడుతోంది. భవిష్యత్తు ఏమవుతుందో తెలియక నలిగి పోయిన వాళ్లంతా మెల్లగా ఊపిరిపీలుస్తున్నారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలీక ఇన్నాళ్లు గందరగోళానికి గురైన వారికి ఎన్నికల ఫలితాలతో స్పష్టత వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఏపీ రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకుంది. చేతిలో డబ్బున్నా పెట్టుబడులు పెట్టలేక బ్యాంకులకు పరిమితం చేసిన వారు కూడా ఇప్పుడు వాటిని నగదుగా మార్చుకుంటున్నారు. గత నాలుగైదు రోజుల్లో భారీ ఎత్తున ఫిక్సిడ్ డిపాజట్లను రద్దు చేసుకుంటున్నారని బ్యాంకులు ధృవీకరిస్తున్నాయి. కోట్లలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు సైతం రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం నగదుగా మార్చుకుంటున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారంలోపే బ్యాంకు డిపాజిట్లను కరిగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇన్నాళ్లు బ్యాంకుల్లో ఫిక్స్డ్‌ డిపాజిట్లుగా ఉన్న నోట్ల కట్టలకు కాళ్లు వస్తున్నాయి. డిపాజిట్లను నగదుగా మార్చుకుని అధిక వడ్డీ, ఆదాయం లభించే మార్గాలపై పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఫిక్సిడ్‌ డిపాజిట్లు తగ్గిపోతే బ్యాంకుల లాభాలు గణనీయంగా తగ్గుతాయిఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్‌ రంగంలో నెలకొన్న అనిశ్చిత క్రమంగా తొలగిపోతోంది. ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతో మొదలైన నిర్మాణరంగం డౌన్‌ ఫాల్‌ ఆ తర్వాత కోలుకోలేదు. చిన్నాచితక పెట్టుబడిదారులు కుదేలైపోయారు. నిర్మాణాలు పూర్తైనా అమ్ముకోలేక అల్లాడిపోయారు. బ్యాంకు వడ్డీలు తీర్చడానికి అయినకాడికి అమ్ముకున్న వారు కొందరైతే ఇసుక కొరత, నిర్మాణ వ్యయానికి అంచనా వ్యయానికి మధ్య వ్యత్యాసం 30-40శాతం పెరగడంతో ప్రాజెక్టుల్ని మధ్యలో ఆపేసిన వారు ఇంకొందరు.ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015లో అమరావతి రాజధానిగా ప్రకటన వెలువడింది. తొలి ఏడాది కొంత సందిగ్ధత కొనసాగినా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించి 2016 ప్రథమార్థంలోనే హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించారు. మొదట్లో తాత్కలికంగా ఎక్కడో చోట సర్దుకుపోయినా ఆర్నెల్లలోనే వెలగపూడిలో సచివాలయం, విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌ స్టేషన్‌లో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణ పనుల్లో వేగంగా పెంచారు.విజయవాడ కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలు నడవడం, కృష్ణా నదికి అవతలి వైపు రాజధాని నిర్మాణంతో రియల్‌ ఎస్టేట్ జెట్‌ స్పీడ్‌లో వెళ్లింది. ఇక హైదరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఉద్యోగులు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విజయవాడ నగరం విస్తరించడానికి పరిమితులు ఉండటం, వ్యవసాయ భూములు కావడంతో నగరం వేగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు విస్తరించింది. 2014కు ముందతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువగా భూముల ధరలు పెరిగాయి.2014 తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందనే విషయంలో రకరకాల ప్రచారాలు జరగడంతో మొదట్లో పెట్టుబడులు పెట్టిన వారు అప్పులు పాలైనా ఆ తర్వాత ఏడాది నుంచి స్థిరమైన వృద్ధి కనిపించింది. 2014లో తాడేపల్లి ప్రాంతంలో గజం భూమి ధర రూ.10-15వేల మధ్యలో ఉంటే 2019 నాటికి అది రూ.50వేలకు చేరింది. ఉండవల్లి, మంగళగిరి, నంబూరు, కాజా ఇలా జాతీయ రహదారి వెంట భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ నడిచింది. ఇటు విజయవాడలో కూడా ఐదేళ్లలో భారీగా నిర్మాణాలు జరిగాయి.2019ఎన్నికల ఫలితాల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం తలకిందులై పోయింది. భూములపై పెట్టుబడులు పెట్టిన వారంతా లబోదిబోమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు కడుతున్నా భూముల భవిష్యత్తు ఏమవుతుందో తెలియక ఆందోళన చెందారు. ఇక గ్రూప్ హౌస్‌లు, చిన్నాచితక పెట్టుబడిదారులైతే విలవిలలాడిపోయారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, టౌన్ ప్లానింగ్ వేధింపులు, ఇసుక కొరత, కార్పొరేషన్లలో సిబ్బంది అరాచకాలతో విసిగిపోయారు. ఎంత పెద్ద బిల్డర్లైనా వార్డు వాలంటీర్లకు లోకువయ్యారన్నట్టు పరిస్థితి తయారైంది. స్థానిక నాయకులకు కప్పం కట్టనిదే నిర్మాణాలు జరగనివ్వని పరిస్థితి తెచ్చారు. దీంతో నిర్మాణదారులు పనులు నిలుపుకుని ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూశారు. రూ.100కోట్లకు పైగా వార‌్షిక లావాదేవీలు జరిగే స్కేల్ 4 బ్రాంచీల్లో ఈ తరహా రద్దీ ఎక్కువగా ఉంటోంది. బ్యాంక్ బ్రాంచీల వారిగా లాభాలను పరిగణలోకి తీసుకుంటే ఈ ప్రాఫిట్స్‌ మళ్లీ గాడిన పడటానికి ఆర్నెల్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో లావాదేవీలను బ్యాంకు ఖాతాలతో చేయాల్సి ఉండటంతో త్వరలోనే డిపాజిట్లు మళ్లీ పెరుగుతాయని ఆశాభావం బ్యాంకుల్లో ఉంది.

Related Posts