YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చదవు మానేసి డ్రగ్స్....

చదవు మానేసి డ్రగ్స్....

హైదరాబాద్, జూన్ 20,
డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులకు అసలు డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నాయి అనే విషయంపై నార్కోటిక్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బీటెక్ లేదా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈజీ మనీ కోసం అలవాటు పడి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‎ను ఆర్డర్ చేయడం నేర్చుకున్న విద్యార్థులు ఇక చదువులకు స్వస్తి చెప్పి డ్రగ్స్ వ్యాపారంపైనే దృష్టి పెడుతున్నారు.ఇటీవల రాచకొండ ఎస్ఓటి పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువకులు చదువును మధ్యలో వదిలేసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లుగా గుర్తించారు. భరత్ రెడ్డితోపాటు విఖ్యాత్ అనే ఇద్దరు విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి ఉన్న నెట్వర్క్ ద్వారా బెంగళూరు నుండి మత్తు పదార్థాలు కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్‎కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా వాడుతున్న ఎండిఎంఏ డ్రగ్‎ను బెంగళూరుకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ ఒక్కో గ్రామంలో 1200 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న విద్యార్థులు తిరిగి వాటిని హైదరాబాదులో అధిక రేటుకు విక్రయిస్తున్నారు. ఒక్కో గ్రామ్ డ్రగ్‎ను 5000 రూపాయలకు విక్రయిస్తున్నారు.వీరిద్దరూ కాలేజీ‎లో డ్రాప్ అవుట్ విద్యార్థులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో భరత్ రెడ్డిపై హయత్ నగర్‎తో పాటు అబ్దుల్లాపూర్‎మెట్‎లోను కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వ్యసనాలకు బానిసై డ్రగ్స్ వ్యాపారంలో ఈజీగా డబ్బులు వస్తాయని తమ చదువులకు స్వస్తి చెప్పి ఈ తరహా వ్యాపారం చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. విద్యార్థులు ఎవరు డ్రగ్స్ బారిన పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related Posts