YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విద్యుత్ కోనుగోళ్లలో తిరకాసులు

విద్యుత్ కోనుగోళ్లలో తిరకాసులు

హైదరాబాద్, జూన్ 20,
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలకు జరిగిన నష్టం అక్షరాలా 85 వేల కోట్లు.. ఇదే లెక్కను విద్యుత్ సంస్థల అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారుఅయితే ఇన్ని వేల కోట్ల భారం ఎందుకు పడింది? మొన్న సీఎం కేసీఆర్ ఏం చెప్పారో గుర్తుందా? తెలంగాణ సర్కార్‌ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకొని ఒక్కో యూనిట్‌ను 3 రూపాయల 90 పైసలకే కొనుగోలు చేసిందన్నారు. కాని చివరకు కరెంట్ సరఫరా అయ్యే సరికి ఆ ధర కాస్త 5 రూపాయల 64 పైసలకు పెరిగింది. దీంతో 3 వేల 110 కోట్ల అదనపు భారం పడింది. అది కూడా ఎప్పుడో ఒప్పందం చేసుకుంటే.. 2017 ఆఖర్లో సరఫరా ప్రారంభమైంది. మరి అదైనా ఒప్పందంలో ఉన్నట్టు వెయ్యి మెగావాట్లు సరఫరా అయ్యిందా అంటే అదీ లేదు. దీంతో 2017 నుంచి 2022 మధ్య కాలంలో మళ్లీ 2 వేల 83 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనాల్సి వచ్చింది. ఈ దారుణం ఇక్కడితో ఆగిందా లేదు.. ఇంకేం జరిగిందో మీరే చూడండి.ఇది ఒప్పందం లెక్కలు.. ఇక యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్లాంట్ల విషయానికి వద్దాం.. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ గురించి కేసీఆర్ ఏం చెప్పారు. అప్పటికప్పుడు మనకు విద్యుత్ తయారీ అత్యవసరం. అందుకే ప్రభుత్వ రంగ సంస్థ BHELతో ఒప్పందం చేసుకున్నాం.. వేగంగా విద్యత్‌ ఉత్పత్తి కోసమే సబ్‌ క్రిటికల్ టెక్నాలజీతో పవర్‌ ప్లాంట్‌ను నిర్మించామన్నారు. కాని.. ఈ వ్యాఖ్యల వెనక కూడా తిరకాసు ఉంది. అసలు గోదావరి నది ఒడ్డునే పవర్ ప్లాంట్ల నిర్మాణంతో ఇప్పుడు మరో పెద్ద నష్టం ఎదురుకాబోతుందని తెలుస్తుంది.బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా.. ప్రజల నెత్తిన వేల కోట్ల అప్పుల భారం పడినట్టు క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది.కేసీఆర్ చెప్పినవన్ని కల్లబొల్లి మాటలే అని దీన్ని బట్టి అర్థమవుతోంది. అనాలోచిత నిర్ణయాలు.. ఏకపక్ష నిర్ణయాలు.. ఇవే బీఆర్ఎస్‌ హయాంలో జరిగిందని తెలుస్తుంది. పేరు కోసం ప్రజల నెత్తిన అప్పులను రుద్దినట్టు అర్థమవుతోంది. ఇప్పటికే కమిషన్‌ విచారణను స్పీడప్ చేసింది. అన్ని వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. అధికారులను విచారిస్తోంది. సో.. వెరీ సూన్ కమిషన్‌ తన తుది నివేదికను సిద్ధం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటి వరకు విచారణలో పాల్గొన్నవారు.. ఎదుర్కొన్నవారు.. విచారణ జరిపే వారు.. ఎవరి నోటిన విన్నా మనకు అర్థమయ్యే విషయం ఒకటే.. అదేంటంటే వేల కోట్లలో ప్రజాధనం వృథా అయ్యింది. దీనికి కారణం మేమే డిజైనర్లు.. మేమే కాంట్రాక్టర్లు.. అంతా మేమే అన్నట్టుగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు.. వారు తీసుకున్న నిర్ణయాలు. మరి ఇదే విషయాన్ని తన రిపోర్ట్‌లో కమిషన్‌ పొందుపరిస్తే ఏం జరగనుంది? ఈ ఏకపక్ష నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించబోతున్నారు? అనేది అతి త్వరలో తేలనుంది.

Related Posts