YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంచి సమాజాన్ని నిర్మించడానికి జర్నలిస్టులు పాటుపడాలి

మంచి సమాజాన్ని నిర్మించడానికి జర్నలిస్టులు పాటుపడాలి

ఖమ్మం
సమాజంలో టీవీలు, సోషల్ మీడియా లాంటివి ఎన్ని వచ్చినా కూడా పత్రికా సామ్రాజ్యానికి ఎదురులేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. సమాజంలో ఎన్ని ఆటుపోట్లు, నిర్బంధాలు ఎదురైనా ధైర్యం, నిబద్ధత, నిజాయితీతో పని చేస్తే తప్ప ఈ సమాజంలో మొనగాడ లేరని ఆయన అన్నారు. జర్నలిజం అనే వృత్తి కత్తి మీద సాము లాంటిదని అన్నారు. అన్నింటికీ ఎదుటి పనిచేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  స్వలాభం కోసం, స్వార్థం కోసం ఈ వృత్తినే దుర్వినియోగం చేయొద్దని సూచించారు. గౌరవం పెంచుకునేలా పనిచేయాలని అన్నారు. బాగా ఎదిగిన వారిని చూసి కురుకులు పరుగులు తీస్తూ, కంగారుపడుతూ ఉండవద్దని, వారిపట్ల అసూయ పడవద్దని అన్నారు. జర్నలిస్టులో నిర్వహించే పాత్ర బృహత్తరమైనదని అన్నారు. ఒక డాక్టర్ తప్పు చేస్తే రోగి మరణిస్తారని, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ప్రాజెక్టు దెబ్బతింటుందని, జర్నలిస్టులు తప్పు చేస్తే సమాజానికి నష్టం కలుగుతుందని అన్నారు. ప్రజలను చైతన్య పరిచే శక్తి జర్నలిస్టులకే ఉందని పేర్కొన్నారు. పత్రిక యాజమాన్యాలు, మీడియా యాజమాన్యాల నుంచి తమకు కొత్త ఇల్లు ఉన్నా కూడా సమాజ పితాని దృష్టిలో పెట్టుకొని వార్తలు రాయలన్నారు. జర్నలిస్టులకు నైతికత, నిబద్ధత, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలన్నారు. నాడు స్వాతంత్ర్య పోరాటంలో పత్రికలదే కీలకపాత్ర అని, పత్రికల్లో వచ్చే వార్తలు కథనాలను చూసే ఉద్యమాలు నడిచాయని గుర్తు చేశారు. ఇప్పుడు పత్రిక, మీడియా రంగం సాంకేతికను అందిపుచ్చుకుందన్నారు. ఒకప్పుడు పత్రికలు, ఆ తరువాత టీవీలు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారము నమ్మదగినది కాదని, టీవీలు చూస్తున్నారని, ఆ సమాచారం నిజామా, కాదా అని పూర్తిగా నిర్ధారించుకునేందుకు తెల్లవారి పత్రికలను చదువుతున్నారని అన్నారు. పత్రిక సామ్రాజ్యానికి ఎదురులేదని అన్నారు. ఇక్కడ ఏ సంఘటన జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, కరోనా వచ్చినా ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తారని అన్నారు. ఆయా కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా తామే కవర్ చేయాలనే తపనతో, పోలీసులు తమను నెట్టివేసినా చొచ్చుకుని వెళ్లి వార్తలను కవర్ చేస్తారని అన్నారు. మీ శ్రమ వృధాగా పోదని ఆయన అన్నారు. మీకున్న పాదన తను మర్చిపోకుండా ఒత్తిళ్ళకు గుడి కాకుండా పనిచేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమి చైర్మన్, ఐజేయు అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు సెక్రటరీ జనరల్, మాజీ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, రాష్ట్ర శాఖ అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి, కె విరహత్ అలీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జాతీయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts