YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో ఎండలు.. 20 మంది మృతి

ఢిల్లీలో ఎండలు.. 20 మంది మృతి

న్యూఢిల్లీ, జూన్ 20,
ఢిల్లీ ప్రజలు కు ఓ వైపు నీటి కష్టాలు..మరోవైపు ఎండలతో అష్టకష్టాలు పడుతున్నారు. ఎండదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 24 గంటల్లో 20 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వడదెబ్బతో ఆస్పత్రులకు వచ్చే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. యూపీలో వడదెబ్బకు 81 మంది ప్రాణాలు కోల్పోయారు.వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 50 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యిందేమో అన్న ఫీలింగ్.. ఢిల్లీవాసుల్లో కలుగుతోంది. సగటున 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఢిల్లీలో యావరేజ్‌గా టెంపరేచర్‌ 46 డిగ్రీలపైనే ఉంటుందని IMD స్పష్టం చేసింది. భానుడి ప్రచండ వేడిమికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక 46 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 17 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.ఢిల్లీతో పాటు ఉత్తర భారతమంతా హీట్‌వేవ్‌ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌తోపాటు పంజాబ్‌లో వేడిగాలుల తీవ్రత మరింత పెరిగింది. గత 24 గంటల్లో ఒక్క బిహార్‌లోనే 22మంది మృతి చెందారంటే పరిస్థితి ఏ విధంగా ఇట్టే అర్థమైపోతుంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు..పక్షులు కూడా చనిపోతున్నాయి. ఢిల్లీ పరిసరాలతోపాటు హర్యానా, పంజాబ్‌, యూపీలో అనేక జంతువులు, పక్షులు ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి.ఉదయం 6 గంటల నుంచే ఢిల్లీలో ఎండత తీవ్రత కన్పిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఎండలు ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఎండల తీవ్రతను తట్టుకోవడానికి జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఢిల్లీతో పాటు యూపీలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. ప్రయాగ్‌రాజ్లో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎప్పుడూ చల్లగా ఉండే హిమాచల్ప్రదేశ్ కూడా ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నది. ఇక్కడ 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. సగటు ఉష్ణోగ్రత కంటే 6.7 డిగ్రీలు ఎక్కువ రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్, కాంట్రాలోనూ ఎండలు దంచికొడ్తున్నాయి. ఇక్కడ 40.8 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. జమ్మూలో ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు టచ్ అయింది. రాజస్థాన్లోని గంగానగర్లో అత్యధికంగా 46.2 డిగ్రీలు రికార్డయింది

Related Posts