YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అనంతపురం,చంద్రన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి -మంత్రి జవహర్

అనంతపురం,చంద్రన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి        -మంత్రి జవహర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను నేటి తరం యువకులు అనుసరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. మంగళవారం నాడు  కొవ్వూరు మండలం పంగిడిలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర ప్రారంభించారు.  నాలుగేళ్ల కాలంలో ప్రతి పల్లెను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటే వైసిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలు పరిష్కరించి ప్రజల ముందుకు రావడం జరిగిందన్నారు. పచ్చని పశ్చిమ గోదావరిలో ఏ1 చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఆదరణ కరువ్వటంతో జగన్ పిచ్చి కూతలు కూస్తున్నారని అన్నారు.
ముందు వెళ్తున్న వాహనాని తప్పించి బోయి ఓ ఆర్టీసి బస్సు  బోల్తా పడడంతో పలువురికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి గ్రామం వద్ద కళ్యాణదుర్గం వైపు వస్తున్న ఆర్టీసి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు ముందు వెళ్తున్న ఓ ట్రాక్టర్ హఠాత్తుగా బ్రేకులు వేయడంతో దాని తప్పించ బోయి ప్రక్కన వున్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో పల్లే వెలుగు బోల్తా పడడంతో పలువురికి గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ప్రయాణికులను బస్సు నుండి బయటకు తీసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న ఆర్డీవో, డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, తాహిసిల్దార్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు  వైద్యమందెల చూసారు. అదే సమయంలో అటు గా వెళ్తున్న గృహనిర్మాణశాఖ మంత్రి  కాలువ శ్రీనివాసులు సంఘటన వివరాలు తెలుసుకున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడమని అధికారులకు సూచించారు. సుమారు 15 మందికి పైగా గాయ పడగా శీబాయి, గోళ్ళ గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కల్పన, రామక్క, గంగమ్మ లను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

Related Posts