YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సెంచరీ దాటేసిన టమోఠా...

సెంచరీ దాటేసిన టమోఠా...

హైదరాబాద్, జూన్ 21,
రాష్ట్రంలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తిగా లేకపోవటంతో కొద్దిరోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు రూ. 80లోపు ఉన్న టమాట, పచ్చి మిర్చీ ధర… ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్క్ ను దాటేసింది. మరికొద్దిరోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.హైదరాబాద్ కూరగాయల మార్కెట్లలోని ధరలు చూస్తే… కిలో టమాట ధర 100కు చేరింది. ఇక పచ్చి మిర్చీ ధర ఏకంగా రూ. 120కు చేరింది. కేజీ బీరకాయ ధర రూ. 100గా ఉండగా… గోరు చిక్కుడు ధర కూడా రూ. 100కు చేరింది. దీంతో  మార్కెట్ లోకి వెళ్లిన విక్రయదారులు… ఏ కూరగాయలు కొనాలన్న ఆలోచించే పరిస్థితి ఉంది.  కిలో టమాట ధర రూ. 80గా ఉంది. పచ్చి మిర్చీ ధర కూడా రూ. 70 - 80 మధ్య పలికింది. గోరు చిక్కుడు ధర రూ. 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 60- 80 మధ్య ఉంది. కానీ రెండు రోజుల వ్యవధిలోనే వీటి ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు మార్కెట్ కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు వాపోతున్నారు.ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో…. కూరగాయల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మే మాసంలో సగం రోజులు పూర్తి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో సీన్ క్రమంగా మారిపోయింది. వానలతో తడిసిపోవటంతో పాటు త్వరగా కుళ్లిపోవటం సమస్యగా మారింది. పక్క రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో కూరగాయలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటి రవాణ ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి.  హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్కెట్లకు ప్రస్తుతం వస్తున్న కూరగాయల్లో 70 నుంచి 80 శాతం పక్క రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి కేవలం 20 శాతం లోపే ఉంది. ఇక వానల రాకతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో త్వరగా కూరగాయలు కుళ్లిపోతుండటంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.  రాష్ట్రంలో చూస్తే… ఈ సీజన్ లో కొంత కరువు ఛాయలు కనిపించాయి. నీటి వసతి లేక చాలా ప్రాంతాల్లో  కూరగాయల సాగు తగ్గింది. వీటి ప్రభావంతో కూడా ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలో పండిన పంట కేవలం 71క్వింటాళ్లు మాత్రమే.  మిగిలిన పంట ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అవుతుంది. ఇందులో 1000క్వింటాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి నుంచి వచ్చింది. తెలంగాణలోని వికారాబాద్, శామీర్పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల,  గజ్వేల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, ప్రాంతాల నుంచి రావాల్సినంత టమాట పంట రావడం లేదు. తీవ్రమైన ఎండల వేడికి టమాట పంట తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు.టమాట ధరల పెరుగుదల మిగతా కూరగాయలపై పడింది.  దీంతో మార్కెట్లో కూరగాయ ధరలు మండిపోతున్నాయి.  పచ్చిమిర్చి కిలో రూ.120 నుంచి రూ.140వరకు పలుకుతోంది. మొన్నటి వరకు రూ.100 లకు నాలుగు కిలోలు వచ్చే ఉల్లిగడ్డలు ప్రస్తుతం వందకు రెండి కిలోలే వస్తున్నాయి. అంటే కిలో ఉల్లి ధర రూ.50 పలుకుతోంది. కొత్తి మీర ధర కూడా భారీగానే పెరిగింది. కిలో కొత్తి మీర రూ.200 పైనే పలుకుతోంది. ఫ్రెంచ్బీన్స్ రూ. 175  నుంచి 210, టమాటా రూ. 100నుంచి 120,  దొండకాయ రూ. 70నుంచి 80, బీరకాయ రూ.80నుంచి 100, బెండకాయ రూ.80నుంచి 100, కాకరకాయ రూ.80, క్యారెట్‌ రూ.80గా ఉన్నాయి. పంట ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో అన్నిరకాల కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్ కు రూ.500 పట్టుకు వెళితే కనీసం సంచి అడుగుకు కూడా నిండడం లేదని సామాన్యులు వాపోతున్నారు.  నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్‌‌‌‌సేల్‌‌‌‌లోనే కిలో రూ.100 దాటింది. కాగా రిటైల్ మార్కెట్లోత కిలో రూ.120 వరకు అమ్ముతున్నారు. ఆలుగడ్డ, చామగడ్డ లాంటివి కూడా కిలో రూ.60కి తగ్గడం లేదు.  అన్నిరకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్‌ కు వెళ్లాలంటే జంకుతున్నారు.  మరికొద్దిరోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వానకాలం సాగు నడుస్తోంది. ఇందుకు సంబంధించిన పంట జూలై, ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది. వీటి ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే… మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటివరకు సామాన్యూల జేబులకు చిల్లు పడే అవకాశం ఉందని అంటున్నారు…!

Related Posts