YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెరపైకి జగన్ విలాస జీవితం....

తెరపైకి జగన్ విలాస జీవితం....

విశాఖపట్టణం, జూన్ 21,
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో  సరిగ్గా రోడ్లను వేయలేకపోయారు. వాటికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేకపోయారు. నిధుల లేమి కారణంగా ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయాయి. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లు సరఫరా చేసినందుకు కోవిడ్ సమయంలో పేషంట్లకు భోజనాలు సరఫరా చేసినందుకు బిల్లులు చెల్లించాలని కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదని   చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షల సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ప్రతీ వారం అప్పులు తీసుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ వివరాలు  బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏపీలో సీఎంగా  జగన్ ఉన్నప్పుడు   ఇష్టపడి కట్టుకున్న  రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు దేశంలో వైరల్ టాపిక్ గా మారింది.   61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారు.  లోటులో ఉన్న రాష్ట్రం... వారానికి మూడు, నాలుగు వేల కోట్లు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకు రానిదే రోజు గడవని రాష్ట్రంలో  జగన్ తాను విశాఖ నుంచి పరిపాలన చేయాలన్న కోరికతో ఈ క్యాంప్ ఆఫీస్‌ను నిర్మంచుకున్నారు.   జాతీయ మీడియా చానళ్లన్నీ జగన్ ప్యాలెస్ పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ భవనంపై జరుగుతున్న ప్రచారం అబద్దమని చెప్పేందుకు కొంత మంది వైసీపీ నేతలు ఇంగ్లిష్ చానళ్లతో మాట్లాడుతూ  ఇది జగన్ సొంత భవనం కాదని ప్రభుత్వ భవనం అంటున్నారు.  అది రాష్ట్రపతి, ప్రధానుల విడిది కోసమంటూ  చెబుతున్నారు.  అయితే రాష్ట్రపతి , ప్రధానులు వస్తే ఎక్కడుండాలో వారికి ప్రత్యేకమైన విడిది నేవల్ బేస్‌లో ఉంటుందని గుర్తు చేస్తున్నారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి వారిపైకి నిందలేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక్క విశాఖ రుషికొండ ప్యాలెస్ మాత్రమే కాదు.. తాడేపల్లి ప్రస్తుతం జగన్ ఉంటున్న నివాసంలోనూ పదుల కోట్లలో ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పించుకున్నారు.  క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్‌, ఇతర సామగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే.. దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి హెచ్‌ బ్లాక్‌ నుంచి యూపీఎస్‌, కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, ఇతర సామగ్రినే అక్కడ వాడుతున్నారు. ఇక కిటికీలు, వ్యూకట్టర్లు, ఏసీలు సహా మొత్తం ప్రజాధనంతోనే కొనుగోలు చేశారు. జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్‌ ఫెన్సింగ్‌ ప్రజాధనతోనే  చేయించుకున్నారు. అమరావతిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతులు లేవని కూల్చివేయించి.. తన విధ్వంస పాలన మొదలుపెట్టారు జగన్ అయితే మరోసారి సీఎం అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విశాఖకు రాజధాని మార్చాలని రుషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాజప్రసాదం కట్టించారు .. దానిపై కేసులు పెడితే కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించారు.  పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని ఇప్పటికే హైకోర్టు నియమించిన కమిటీ తేల్చింది. హైకోర్టు నిర్ణయం రావాల్సి ఉంది. ఇవి మాత్రమే కాదు.. జగన్ కుటుంబానికి చెందిన   సాక్షి దినపత్రిక, భారతి సిమెంట్స్  కూడా అత్యధిక కొనుగోలు దారు ఏపీ ప్రభుత్వమే.  సాక్షి పత్రిక సర్క్యూలేషన్‌ లో సగానిపైగా ప్రజల డబ్బుతోనే కొనపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటర్లు ఇలా అందరితో కొనిపించారు.  ఇక భారతి సిమెంట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏపీలో జరిగిన ప్రతి నిర్మాణానికి భారతి సిమెంట్స్ వాడారు.  రేటు పెంచి మరీ అందరూ కొనుగోలు చేసేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా స్పెషల్ ఫ్లైట్లే. రెండు కిలోమీటర్లకు హెలికాప్టర్ రైడ్ ఉపయోగి్సతారు.  ప్రజాధనాన్ని ఇలా సొంతానికి వాడుకున్న ఒక్కరంటే ఒక్క సీఎం కూడా చరిత్రలో ఉండరన్న విమర్శలు అందుకే వస్తున్నాయి. ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇంత విచ్చలవిడిగా ప్రజాధనాన్ని సొంత ఖర్చులకు ఎలా చేసుకుంటారన్న ప్రశ్నలు సామాన్యుల దగ్గర నుంచి వస్తున్నాయి.  ముఖ్యమంత్రి ప్రజాసొమ్ముకు కస్టోడియన్. ప్రజలు శ్రమ చేసి రూపాయి రూపాయి పన్నులుగా కడితే వచ్చే సొమ్మును అంతే జాగ్రత్తగా ప్రజోపయోగం కూడా వాడాలి. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే.. తనకు  ప్రజల సొమ్ముపై తనకు పేటెంట్ ఉన్నట్లు ఇష్టానుసారం ఖర్చుచేయడానిక అవకాశం లేదు.  కానీ ఇప్పుడా ఆలోచన అధికారంలోకి వచ్చే వారికి ఉండటం లేదు.   
బయిటకు వస్తున్న దుబారా ఖర్చులు
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ దుబారా ఖర్చులు తగ్గించేందుకు అనేక సంస్కరణలు చేపట్టారు. అసెంబ్లీలో క్యాంటీన్ ను మూయించారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రజా ప్రతినిధులకు ఇష్టం లేకున్నా.. ప్రజల మధ్య చులకన అవుతామని భావించి ఎవరూ నోరు మెదపలేదు. కానీ తాను ఒక నిరుపేద ముఖ్యమంత్రినని.. పెత్తందారులతో పెద్దయుద్ధమే చేస్తున్నానని నిన్నటి వరకు ఏపీని పాలించిన జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన అధికారం నుంచి దూరమైన నాటి నుంచి ఆయన పేద కాదు.. ధనిక సీఎం అని ఒక్కొక్క ఘటన వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న రుషికొండలో కళ్ళు బైర్లు కమ్మే నిర్మాణాలు బయటకు వచ్చాయి. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ భవనాల్లో ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఆ విషయం అలానే ఉండగా.. జగన్ సర్కార్ కౌన్సిల్ సమావేశం నాడు టీ ఖర్చు అక్షరాలా రూ.4,12,000 (నాలుగు లక్షల 12 వేల రూపాయలు).ఒక్కరోజులో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే టి, కాఫీ తాగేసారంటే ఈ పేద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంత ఆకలితో ఉన్నారో అర్థమవుతుంది. అయితే ముందస్తుగానే అంచనా వేసి మరి టీ, కాఫీ కోసం నిధులు కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2021 డిసెంబర్ 10న కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆరోజు టి, కాఫీ, స్నాక్స్ ఖర్చు కోసమని రూ.4,12,000 అవసరమని ముందుగానే ఎస్టిమేషన్ తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఎస్టిమేషన్కు సంబంధించి ధ్రువీకరణ పత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక్కరోజులో అంత ఎలా తాగారు రా? నీళ్లు కూడా తాగకుండా.. కాఫీ,టీలు మాత్రమే తాగారా ఏంట్రా? అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.ఆంధ్ర పేద రాష్ట్రం అని చెప్పుకునే జగన్ దీనికి సమాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. సిబిఎన్ ఎగైన్ పేరిట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. రుషికొండలో నిర్మాణాల విషయంలోనే వైసీపీ చుట్టూ పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. అక్కడ నిర్మాణాలు, కట్టడాలు.. ఇలా ఒకటేమిటి ప్రతి అంశము వైరల్ గా మారింది. వైసీపీ నుంచి దిద్దుబాటు చర్యలకు నేతలు దిగుతున్నా ప్రజల్లోకి బలంగా చర్చికెళ్ళింది. ఇప్పుడు టీ, కాఫీ, స్నాక్స్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో జరిగిన దుబారా ఖర్చు బయట పెట్టాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. మున్ముందు ఇలాంటి పోస్టులు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ దుబారా ఖర్చు హైలెట్ అవుతోంది.    

Related Posts