YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగని ఫర్నిచర్ రచ్చ మీకో రూల్... మాకో రూలా...అంటూ క్వశ్చన్

ఆగని ఫర్నిచర్ రచ్చ మీకో రూల్... మాకో రూలా...అంటూ క్వశ్చన్

గుంటూరు, జూన్ 21,
అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీ ఫర్నిచర్‌ కొంత అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్యాంపు ఆఫీసులో ఉండేది. ప్రభుత్వం మారాక దానిని తీసుకెళ్లాలని.. లేకపోతే ఆ ఫర్మిచర్‌కి ధర చెల్లిస్తానని ఆయాన లేఖ రాసి.. తన తర్వాతి స్పీకర్ తమ్మినేనికి సమాచారం కూడా ఇచ్చారు. అయినా వాటన్నిటినీ పక్కనపెట్టి మాజీ స్పీకర్‌పై దొంగతనం కేసు పెట్టి అవమానించారు. ఇప్పుడు మాజీ సీఎం జగన్ క్యాంపుగా మార్చుకున్న తాడేపల్లి ప్యాలెస్‌‌లో ప్రభుత్వ ఫర్మీచరే ఇంకా వాడుతున్నారు. నాడు మాజీ స్పీకర్‌పై దొంగ ముద్ర వేసిన మాజీ సీఎంపైన కూడా అదే దొంగతనం కేసు పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సీఎం అయ్యే నాటికే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్న జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ సొమ్ముతో దాన్ని ముస్తాబు చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అప్పుడు జగన్‌ పేషీలో పనిచేసిన కార్యదర్శులు, నామినేటెడ్ సలహాదారులు కూడా ప్రభుత్వ ఫర్మీచర్‌నే వాడుకున్నారు. వారి పదువుల పోయి రోజులు గడుస్తున్నా ఇంకా ఫర్మీచర్ అప్పగించలేదని అధికారుల చెప్తున్నారు. సెక్రటేరియట్‌ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం 15 రోజుల్లో.. ఫర్నీచర్‌, ఇతర సామాగ్రిని అప్పగించాలని నిబంధన ఉంది. ఆ క్రమంలో వారందరికీ ఫర్నీచర్‌తో పాటు ఇతర సామాగ్రిని పంపాలని జీఏడి నోటీసులు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్‌ ఇంట్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకున్నారంటున్నారు. దానికి సంబంధించిన జీఓలు కూడా ఉన్నాయంట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్ లీడర్ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై ఫర్నిచర్‌ దొంగగా ముద్ర వేసి కేసులు పెట్టింది జగన్ సర్కారు.  అప్పటి నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ఫిర్యాదు ఇప్పించి మరీ కేసు నమోదు చేయించారు.అప్పట్లో వివాదాస్పదమైన ఫర్నిచర్‌ హైదరాబాద్‌లో ఉమ్మడి అసెంబ్లీకి సంబంధించింది. ఏపీ వాటాగా అందులో కొంత ఫర్నిచర్‌ను లారీల్లో అమరావతికి పంపారు. పెద్ద పెద్ద టేబుళ్లు, పాత కుర్చీలు అందులో ఉన్నాయి. అప్పటికే అమరావతిలోని అసెంబ్లీలో పూర్తిస్థాయి ఫర్నిచర్‌ను సమకూర్చుకున్నారు. కొత్త అసెంబ్లీలో పెట్టడానికి ఖాళీ లేకపోవడంతో వాటిని తన క్యాంపు కార్యాలయంలో పెడితే వాడుకుంటానని స్పీకర్ కోడెల చెప్పడంతో దాంతో అక్కడకు పంపారు.2019 ఎన్నికల్లో టీడీపీతోపాటు కోడెల కూడా ఓడిపోయారు. వైసీపీ పగ్గాలు చేపట్టిన వెంటనే కోడెల అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్‌ చేసి తన క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ ఉందని తీసుకెళ్లాలని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శికి ఒక లేఖ కూడా రాశారు. పాత ఫర్నిచర్‌కు రేటు నిర్ణయిస్తే దానిని చెల్లించి తానే ఉంచుకుంటానని అందులో పేర్కొన్నారు. తర్వాత కొత్త స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు కోడెల మరో లేఖ రాశారు. ఈ లేఖ అందినట్లుగా స్పీకర్‌ కార్యాలయం సిబ్బంది సంతకం కూడా చేశారు.ఈ లేఖలు పక్కన పడవేసి అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల దొంగతనం చేశారంటూ కేసు నమోదు చేశారు. అవమానంతో కుంగిపోయిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడుపులిగా పేరున్న ఆ సీనియర్ లీడర్ అలా మరణించడం పెద్ద కలకలమే రేపింది. ప్రభుత్వం తనపై ఫర్నిచర్‌ దొంగతనం మోపడంతోనే ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపించారు … కోడెల తన క్యాంపు కార్యాలయంలో వాడుకొన్న పాత ఫర్నిచర్‌ మొత్తం విలువ రూ. 2లక్షలకు మించదని అప్పట్లో అసెంబ్లీ వర్గాలు లెక్కగట్టాయి.కోడెల రాజకీయాల్లోకి రాక ముందే స్థితిమంతులు.. నరసరావుపేటలో సొంత కోట ఉన్న ఆయన మంచి పేరున్న డాక్టర్ .. అంత ఆస్తిపరుడిపై ఫర్నిచర్‌ దొంగతనం కేసు మోపడం టీడీపీ వర్గాలను కలచివేసింది. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి జగన్‌కు ఎదురైంది. సీఎంగా ఉన్న సమయంలో ఆయన తన తాడేపల్లి ప్యాలెస్లో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ వినియోగించుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఆ ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి.అయితే ఆ ఫర్నిచర్‌ ధర ఎంతో చెబితే చెల్లిస్తామని వైసీపీ ఎమ్మెల్సీ పేరిట ప్రకటన వెలువడింది. దానిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ‘అప్పుడు కోడెలపై ఏం కేసు పెట్టారో ఇప్పుడు జగన్‌పై కూడా అదే కేసు పెట్టాలి’ అని ఆ పార్టీ సీనియర్‌ నేతలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. మరి మాజీ సీఎం దానిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Posts